Best Web Hosting Provider In India 2024
Ayodhya Kashi IRCTC Package : తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య, కాశీతో సహా పలు పుణ్య క్షేత్రాల సందర్శనకు ఐఆర్సీటీసీ 10 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ కవర్ చేస్తూ 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ తో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ నడుపోతోంది ఐఆర్సీటీసీ. ఈ రైలు ద్వారా అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 10 రోజుల టూర్ లో ఆరు ముఖ్యమైన దేవాలయాలను సందర్శించవచ్చు. తదుపరి టూర్ తేదీ 08.06.2024. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,525.
- టూర్ లో సందర్శించే ప్రాంతాలు : పూరీ – కోణార్క్ – గయ – వారణాసి – అయోధ్య – ప్రయాగరాజ్
- భారత్ గౌరవ్ ట్రైన్ సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)
- బోర్డింగ్ / డీ బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం
టూర్ ధర(ఒక్కో వ్యక్తికి)
- ఎకానమీ (SL) – రూ. 16,525(పెద్దలకు), రూ. 15,410(పిల్లలు 5-11 సంవత్సరాలు)
- స్టాండర్డ్ (3AC)- రూ 25,980(పెద్దలకు), రూ. 24,670(పిల్లలు 5-11 సంవత్సరాలు)
- కంఫర్ట్ (2AC)- రూ. 33,955(పెద్దలకు), రూ. 32,380(పిల్లలు 5-11 సంవత్సరాలు)
ఈ టూర్ లో కవర్ చేసే ప్రాంతాలు :
- పూరీ- జగన్నాథ దేవాలయం
- కోణార్క్- సూర్య దేవాలయం
- గయ- విష్ణుపాద దేవాలయం
- వారణాసి- కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, సాయంత్రం గంగా హారతి
- అయోధ్య – సరయు నది వద్ద రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి, హారతి
- ప్రయాగరాజ్- త్రివేణి సంగమం
- డే 1 : సికింద్రాబాద్ మధ్యాహ్నం 12:00 గంటలు భారత్ గౌరవ్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. విజయవాడలో సాయంత్రం 6.15 గంటలకు , ఏలూరు(సాయంత్రం 7.30 గంటలకు), రాజమండ్రి(రాత్రి 9 గంటలకు), సామర్లకోట(రాత్రి 9.45 గంటలకు) ప్రయాణికులు బోర్డింగ్ ఉంటుంది.
- డే 2 : పెందుర్తి(అర్ధారాత్రి 1.20 గంటలకు), విజయనగరం(తెల్లవారుజామున 2.10 గంటలకు) ప్రయాణికులు బోర్డింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటలకు మల్తీపట్పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పూరీకి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత పూరీ జగన్నాథ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి పూరీలోనే బస ఉంటుంది.
- డే 3 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం గయాకు వెళ్లడానికి తిరిగి రైలు ఎక్కేందుకు మల్తీపట్పూర్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. (భువనేశ్వర్ – కటక్ – భద్రక్ – బాలాసోర్ – అద్రా ద్వారా). మధ్యాహ్నం 2 గంటలకు రైలు బయలుదేరుతుంది.
- డే 4 : ఉదయం 7 గంటలకు గయా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్ చేరుకుని ఫ్రెష్ అవుతారు. అనంతరం గయాలో విష్ణుపాద ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం వారణాసికి వెళ్లడానికి రైలు ఎక్కేందుకు గయా రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 11.30 కి ట్రైన్ బయలుదేరుతుంది.
- డే 5 : ఉదయం 5 గంటలకు రైలు బనారస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి హోటల్ కు బయలుదేరివెళ్తారు. అనంతరం కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం గంగా హారతి వీక్షిస్తారు. రాత్రికి వారణాసిలోనే బస చేస్తారు.
- డే 6 : ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి కాశీలోని దేవాలయం, ఘాట్ లను సందర్శిస్తారు. మధ్యాహ్నం సారనాథ్ స్థూపంను సందర్శిస్తారు. రాత్రికి వారణాసిలోనే బస చేస్తారు.
- డే 7 : ఉదయం 7 గంటలకు అయోధ్యకు వెళ్లేందుకు బనారస్ లో రైలు ఎక్కుతారు. మధ్యాహ్నం 12 గంటలకు సలార్పూర్ రైల్వే స్టేషన్ (అయోధ్య) చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్ తీసుకెళ్తారు. అనంతరం అయోధ్య రామజన్మ భూమి, హనుమంగారి సందర్శిస్తారు. సరయు నది వద్ద సాయంత్రం నదీ హారతి వీక్షిస్తారు. సలార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. డిన్నర్ తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి రైలు ఎక్కుతారు.
- డే 8 : ఉదయం 04:30 గంటలకు ప్రయాగ రాజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానం చేయడానికి వెళ్తారు. గంగా, యమునా, సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమం. అనంతరం ప్రయాగ్‌రాజ్ నుంచి సికింద్రాబాద్‌కి తిరుగు ప్రయాణం అవుతారు.
- డే 9 : విజయనగరం(సాయంత్రం 6:25 గంటలకు), పెందుర్తి(సాయంత్రం 7:15 గంటలకు), సామర్లకోట (రాత్రి 11:20 గంటలకు) ప్రయాణికుల డీ బోర్డింగ్ చేస్తారు.
- డే 10 : రాజమండ్రి(అర్ధరాత్రి 12:10 గంటలకు), ఏలూరు(తెల్లవారుజామున 03:00 గంటలకు), విజయవాడ(ఉదయం 04:05 గంటలకు), సికింద్రాబాద్(మధ్యాహ్నం 12.30 గంటలకు) ప్రయాణికుల డీబోర్డిండ్ ఉంటుంది. దీంతో పర్యటన ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర బుక్కింగ్, పూర్తి వివరాలను ఈ కింది లింక్ లో చెక్ చేసుకోవచ్చు.
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG24
సంబంధిత కథనం
టాపిక్
IrctcIrctc PackagesTourismAp TourismTelangana TourismSouth Central RailwayAyodhya Ram MandirTemples