Alcohol: ప్రతిరోజూ మద్యం తాగేవారు దాన్ని తాగడం హఠాత్తుగా మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?

Best Web Hosting Provider In India 2024

Alcohol: మద్యానికి అలవాటు వాడికి పడిన వారి సంఖ్య అధికమే. రోజులో రాత్రిపూట మద్యం తాగాకే నిద్రపోతారు. కొంతమంది పరిమితంగా తాగితే, మరికొందరు తాగి పడిపోయేదాకా తాగుతూ ఉంటారు. ఇలా మద్యానికి బానిస అయిన వాళ్ళు అకస్మాత్తుగా తాగడం మానేయకూడదనే వాదన ప్రజల్లో ఉంది. అయితే ఆ వాదన కేవలం అపోహ అని చెబుతున్నారు వైద్యులు. మద్యానికి అలవాటు పడినవారు, బానిసలుగా మారిన వారు, హఠాత్తుగా మద్యాన్ని మానేసినా కూడా శరీరానికి ఎలాంటి నష్టము లేదని, శరీరం మరింత ఆరోగ్యంగా మారుతుందని చెబుతున్నారు.

మద్యం తాగాక ఏమవుతుంది?

మద్యం తాగిన తర్వాత అది నేరుగా ఎక్కడికి వెళుతుందో, ఎలాంటి మార్పులను చేస్తుందో చాలామందికి తెలియదు. కొంతమంది మద్యం తాగిన తర్వాత అది మూత్రం రూపంలో బయటికి పోతుందని అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఆల్కహాల్ తాగిన తర్వాత అది పొట్టలో నుంచి నేరుగా చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ అల్డిహైడ్స్ అనే ఒక రసాయనంగా విడిపోతుంది. అది పొట్ట నుంచి పేగుల్లోకి, అక్కడ్నించి రక్తంలో కలిసిపోతుంది. అక్కడ నుంచి కాలేయానికి చేరుతుంది. కాలేయం ద్వారా అది ఇతర శరీర భాగాలకు కూడా చేరుతుంది.

అల్డిహైడ్ చాలా హానికరమైనది. ఇది రక్తం ద్వారా కాలేయానికి చేరుతుంది. కాలేయంలో పేరుకుపోయి… కాలేయ పనితీరును అల్డిహైడ్ దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ తాగిన కొద్ది సమయానికే అది కాలేయంపై ప్రభావాన్ని చూపించడం మొదలు పెడుతుంది.

తరచూ మద్యం తాగి అలవాటు ఉన్నవారికి కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. అవి కాలేయ పనితీరును మారుస్తాయి. లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి సమస్యలకు కారణం అవుతాయి. శరీరంలో శక్తి కోల్పోవడం డీహైడ్రేషన్ బారిన పడటం, పచ్చ కామెర్లు రావడం. రక్తపు వాంతులు అవ్వడం, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హఠాత్తుగా మద్యం మానేస్తే…

మద్యపానం దీర్ఘకాలంగా తాగితే కాలేయం దెబ్బతినడం ఖాయమని చెబుతున్నారు వైద్యులు. ఇలాంటివారు హఠాత్తుగా మద్యాన్ని తాగడం మానేసినా కూడా దెబ్బతిన్న కాలేయం తిరిగి ఆరోగ్యంగా మారడానికి చాలా సమయం పడుతుందని వివరిస్తున్నారు. ఆల్కహాల్ కు బానిసలుగా మారిన వారు వెంటనే మద్యాన్ని తాగడం మానేసినా శరీరానికి ఎలాంటి నష్టం లేదని వివరిస్తున్నారు. కొంతమంది అలా మానేయకూడదని ప్రతిరోజు కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తారు. ఏదైనా కూడా చివరకు ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడం అనేది ఆరోగ్యకరమైన అలవాటని చెబుతున్నారు.

ఆల్కహాల్ అధికంగా తాగడం వల్ల లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడతారు. ఈ వ్యాధులు ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేసినా కూడా ఆ వ్యాధి నుంచి బయటపడడం కాస్త కష్టమే. దీనికి దీర్ఘకాలం పాటు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. మధ్యపానం వల్ల మెదడు కూడా దెబ్బతింటుంది. మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. మద్యం తాగిన మనిషి విచక్షణ కోల్పోవడానికి ఇదే కారణం. కాబట్టి ఆల్కహాల్ ను వెంటనే మానేసి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రారంభించడం ఉత్తమమని చెబుతున్నారు వైద్యులు.

ఆల్కహాల్ మానేసిన తర్వాత మానసికంగా, శారీరకంగా చిన్నచిన్న ప్రభావాలు పడతాయని వివరిస్తున్నారు. దీన్ని ‘విత్ డ్రాయల్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. ఆల్కహాల్ హఠాత్తుగా మానేస్తే వారిలో టెన్షన్ గా అనిపించడం, అలసటగా అనిపించడం, వణుకు రావడం వంటివి జరుగుతాయి. దీనికి వైద్యుల వద్ద చికిత్స ఉంది. ఆ చికిత్స తీసుకుంటే ఈ లక్షణాలు ఏవీ రాకుండా ఉంటాయి. మద్యం తాగడం మానేసిన వారికి చెవుల్లో తమను ఎవరో పిలుస్తున్నట్టు వినిపించడం వంటి భ్రాంతులు కూడా కలుగుతాయి. ఇవన్నీ మానసిక సమస్యలు. వీటికి తగిన చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని గడపవచ్చని వైద్యులు చెబుతున్నారు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024