Monsson Arrived: ఏపీని తాకిన రుతుపవనాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు

Best Web Hosting Provider In India 2024

Monsson Arrived: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకపై ఐఎండి అంచనాలు య ఫలించాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్సాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తీర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయి. రెండు మూడు రోజుల్లో రుతు పవనాలు ఏపీ అంతటా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

ఆదివారం రాత్రి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.

ఆదివారం రాత్రి రాష్ట్రంలోని 43 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో 64.5-115.5మిమీ వర్షపాత కురిసింది. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7మిమీ, నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2మిమీ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2మిమీ వర్షపాతం నమోదైంది. 205 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 15.6-64.4మిమీ వర్షపాతం నమోదైంది.

రుతపవనాల ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

రుతుపవనాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది. జూన్ నెలలో సాధరణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి.సోమవారం ఓ మోస్తరు వర్షాలు, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.

సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు సూచించారు.

ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7మిమీ, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7మిమీ, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33మిమీ, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2మిమీ, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22మిమీ, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

WeatherAp RainsImd AmaravatiSdmaMonsoon
Source / Credits

Best Web Hosting Provider In India 2024