Biggest Flop Hero: ఇండియాలో అతిపెద్ద ఫ్లాప్ హీరో ఇతడే.. రూ.1300 కోట్ల నష్టాలు మిగిల్చిన సినిమాలు

Best Web Hosting Provider In India 2024

Biggest Flop Hero: దేశంలోనే అతి పెద్ద ఫ్లాప్ హీరో.. ఇప్పటికీ స్టార్ హీరోల్లో ఒకరంటే నమ్మగలరా? ఆ హీరో పేరు అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకడైన అక్షయ్.. తన కెరీర్లో నిర్మాతలకు ఏకంగా రూ.1300 కోట్ల నష్టాలను మిగిల్చాడు. మూడు దశాబ్దాలుగా హిందీ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన అక్షయ్.. అదే స్థాయిలో ఫ్లాప్ లనూ మూటగట్టుకున్నాడు.

అక్షయ్ కుమార్.. ఓ పెద్ద ఫ్లాప్ హీరో

అక్షయ్ కుమార్ కెరీర్ చాలా వింతగా సాగిందని చెప్పొచ్చు. తన కెరీర్లో ఎన్ని హిట్స్ ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోని సూపర్ హిట్స్ లో కొన్ని అక్షయ్ సొంతం. అదే సమయంలో అతిపెద్ద ఫ్లాప్స్ లోనూ అతనికే చెందిన చాలా సినిమాలు ఉండటం గమనార్హం. అంతేకాడు 2007 నుంచి 2017 మధ్య దశాబ్ద కాలం పాటు ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.

మరి అలాంటి హీరో ఖాతాలో ఇంత పెద్ద ఫ్లాపులు ఎలా నమోదయ్యాయి? ఏకంగా రూ.1300 కోట్ల నష్టాలు ఎలా ఎదురయ్యాయి అన్నది కూడా ఆసక్తికర విషయమే. 1991 నుంచి 2024 మధ్య అతడు నటించిన చాలా సినిమాలు ఫ్లాపవడంతో మేకర్స్ కు భారీ నష్టాలు వాటిల్లాయి. ఏ ఇండియన్ యాక్టర్ ఎదుర్కోనంత భారీ నష్టాలు ఇవి. వీటిలో గత ఐదేళ్లలో వచ్చిన నష్టాలే ఎక్కువ.

అక్షయ్ ఫ్లాపులు ఇవే..

అక్షయ్ కు మొదట షాకిచ్చిన మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్. ఈ సినిమా ఏకంగా రూ.170 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ఇక ఈ ఏడాది వచ్చిన బడే మియా చోటే మియా మూవీ అయితే రూ.260 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఇవే కాకుండా గత ఐదేళ్లలో సెల్ఫీ, రామ్ సేతు, జోకర్, జానీ దుష్మన్, అఫ్లటూన్ లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

ఇన్ని ఫ్లాపులు, ఇంత భారీ నష్టాలు వచ్చినా.. అక్షయ్ కుమార్ ఇప్పటికీ బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అతిపెద్ద హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అతని కెరీర్లో భారీ ఫ్లాపులు ఉన్నట్లే హిట్స్ కూడా ఉన్నాయి. గత మూడు దశాబ్దాల్లో అక్షయ్ నటించిన హిట్ సినిమాలు ఏకంగా రూ.7 వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టాయి. గతేడాది అతడు నటించిన ఓఎంజీ 2 మూవీ కూడా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది.

ఇప్పుడు కూడా అక్షయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సింగం అగైన్, వెల్కమ్, జంగిల్, స్కైఫోర్స్, సర్ఫిరాలాంటి సినిమాలు ప్రస్తుతం అక్షయ్ చేస్తున్నాడు. ఇవే కాకుండా హేరా ఫేరి 3, జాలీ ఎల్ఎల్‌బీ 3లాంటి సీక్వెల్స్ లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులోనూ కన్నప్ప మూవీలో అక్షయ్ అతిథి పాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో అతనికి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి తన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024