Vettaiyan vs Devara: ర‌జ‌నీకాంత్‌ వ‌ర్సెస్ ఎన్టీఆర్ – ద‌స‌రాకు దేవ‌ర‌తో వేట్ట‌యాన్‌ బాక్సాఫీస్ ఫైట్

Best Web Hosting Provider In India 2024

Vettaiyan vs Devara: ర‌జ‌నీకాంత్ వేట్ట‌యాన్ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. అక్టోబ‌ర్ 10న వరల్డ్ వైడ్‌గా ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ రిలీజ్ కాబోతుంది. వేట్ట‌యాన్ రిలీజ్ డేట్‌ను ర‌జ‌నీకాంత్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఇటీవ‌లే వేట్ట‌యాన్ షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు ర‌జ‌నీకాంత్‌.

త్వ‌ర‌లోనే కూలీ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్నాడు.ఈ గ్యాప్‌లో హిమాల‌యాల‌కు టూర్‌కు వెళ్లాడు ర‌జ‌నీకాంత్‌. హిమాల‌యాల్లో ప‌లువురు సాధువుల‌ను క‌లిశాడు. సాధువుల‌తో ర‌జ‌నీకాంత్ మాట్లాడుతోన్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

ద‌స‌రాకు రిలీజ్‌…

సాధువులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ర‌జ‌నీకాంత్ బ‌దులు ఇచ్చాడు. వేట్టాయాన్ రిలీజ్ డేట్‌నుఅఫీషియ‌ల్‌గా ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. వేట్ట‌యాన్‌లో త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్త‌యిందని ర‌జ‌నీకాంత్ ఈ వీడియోలో పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఇత‌ర న‌టీన‌టుల‌పై ద‌ర్శ‌కుడు షూటింగ్‌ను జ‌రుపుతున్నాడ‌ని ర‌జ‌నీకాంత్ అన్నాడు. .

కూలీ షూటింగ్ అప్పుడే…

లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో చేయనున్న కూలీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను ర‌జ‌నీకాంత్ రివీల్ చేశాడు. కూలీ షూటింగ్ జూన్ 10 నుంచి మొద‌లుకాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

దేవ‌ర వ‌ర్సెస్ వేట్ట‌యాన్‌…

వేట్ట‌యాన్ త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. ద‌స‌రాకు అక్టోబ‌ర్ 10న ఎన్టీఆర్ దేవ‌ర కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. దాదాపు మూడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న దేవ‌ర‌ సినిమాను పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.

ర‌జ‌నీకాంత్‌, ఎన్టీఆర్ మ‌ధ్య బాక్సాఫీస్ పోరు ఆస‌క్తిక‌రంగా మార‌నుంది. దేవ‌రతో పోటీ కార‌ణంగా తెలుగులో వేట్ట‌యాన్‌కు థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్టంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రోవైపు దేవ‌ర త‌మిళంలో రిలీజ్‌కానుంది. ర‌జ‌నీ సినిమాతో పోటీప‌డి ఎన్టీఆర్ ఏ మేర‌కు త‌మిళ‌నాడు బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌తాడ‌న్న‌ది చూడాల్సిందే.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఫ‌హాద్ ఫాజిల్‌…

వేట్ట‌యాన్ సినిమాకు జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ రూపొందుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో పాటు ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మంజు వారియ‌ర్‌, దుషారా విజ‌య‌న్‌, రితికా సింగ్ ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. వేట్ట‌యాన్ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

జాన్వీక‌పూర్ హీరోయిన్‌…

ఎన్టీఆర్ దేవ‌ర మూవీకి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ ఇది. దేవ‌ర‌తో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రెండు పార్ట్‌లుగా దేవ‌ర సినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు కొర‌టాల శివ‌. తీర ప్రాంతాల హ‌క్కుల కోసం పోరాడే నాయ‌కుడిగా ఎన్టీఆర్ ఈ మూవీలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.

దేవ‌ర‌తో పాటు ర‌జ‌నీకాంత్ వేట్ట‌యాన్ సినిమాల‌కు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. అత‌డు మ్యూజిక్ అందిస్తోన్న రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయి.

IPL_Entry_Point

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024