Best Web Hosting Provider In India 2024
Gangs of Godavari: విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. సోమవారం నాటి కలెక్షన్స్‌తో ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
నైజాంలో హయ్యెస్ట్…
మూడు రోజుల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ పధ్నాలుగు కోట్ల వరకు గ్రాస్, 6.62 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు చెబుతోన్నారు. నైజాంలో అత్యధికంగా ఈ మూవీ 2.48 కోట్లకుపైగా కలెక్షన్లను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. నైజాం తర్వాత సీడెల్‌లో కోటి ముప్పై లక్షల వరకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వసూళ్లను వచ్చినట్లు చెబుతోన్నారు. వైజాగ్‌లో 77, ఈస్ట్ గోదావరిలో 52, గుంటూరులో యాభై లక్షల వరకు ఈ సినిమా కలెక్షన్లను దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
ఎనిమిదికోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్…
తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనిమిది కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీ 82 శాతం వరకు రికవరీ అయినట్లు చెబుతోన్నారు. సోమవారం నాటి కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటి లాభాల్లోకి ఈ సినిమా అడుగుపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నేహా శెట్టి హీరోయిన్…
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రను పోషించింది.
ఈ సినిమాలో లంకల రత్న అనే పాత్రలో విశ్వక్‌సేన్ యాక్టింగ్, హీరోయిజంతో పాటు అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. నెగెటివ్ షేడ్స్‌తో విశ్వక్‌సేన్ క్యారెక్టర్‌కు దర్శకుడు రాసుకున్న తీరు బాగుందంటూ అభిమానులు చెబుతోన్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ ఇదే…
రత్నాకర్ అలియాస్ లంకల రత్న (విశ్వక్‌సేన్) దొంగతనాలు చేస్తూ బతుకుతుంటాడు. . ఎమ్మెల్యే దొరస్వామి రాజు గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్న రత్న కొన్ని పరిణామాలతో అతడికే పోటీగా ఎన్నికల్లో బరిలో దిగుతాడు. . నానాజీ (నాజర్) సహాయంతో ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రత్న జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? రత్నను జైలుకు పంపించింది ఎవరు? రత్నను ప్రేమించి పెళ్లాడిన బుజ్జి (నేహాశెట్టి)అతడిని చంపడానికి ఎందుకు ప్రయత్నించింది? రత్నకు వేశ్య రత్నమాలతో (అంజలి) ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
మెకానిక్ రాఖీ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. గతంలో రౌడీ ఫెల్లో, ఛల్ మోహన రంగ సినిమాలకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దర్శకుడిగా అతడి మూడో సినిమా.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత విశ్వక్‌సేన్ తెలుగులో ఓ మూడు సినిమాలు చేయబోతున్నాడు. విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మెకానిక్ రాఖీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.