Ram Charan Daughter: ప్రభాస్ బుజ్జితో రామ్ చరణ్ కూతురు.. ఉపాసన షేర్ చేసిన ఈ క్యూట్ ఫొటో చూశారా?

Best Web Hosting Provider In India 2024

Ram Charan Daughter: రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల తనయ క్లిన్ కారాకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ బుజ్జి వెహికిల్ కు ఓ లింక్ ఉంది. ఆ బుజ్జికి నమూనాలోని బొమ్మతో క్లిన్ ఆడుకుంటున్న ఫొటో అది. ఉపాసన కొణిదెల ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది.

బుజ్జి బొమ్మతో క్లిన్ కారా

కల్కి 2898 ఏడీ మూవీలోని బుజ్జి కారు ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఆరు టన్నుల బరువున్న ఈ స్పెషల్ కారును సినిమా కోసమే తయారు చేశారు. ఈ మధ్యే ప్రభాస్ తోపాటు మూవీ మేకర్స్ బుజ్జిని పరిచయం చేశారు. ఇప్పుడీ బుజ్జి దేశమంతా తిరుగుతోంది. చెన్నైలోనూ ఈ కారు అక్కడి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ఈ బుజ్జికి సంబంధించిన బొమ్మలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ బొమ్మను మేకర్స్ ప్రత్యేకంగా రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాకు గిఫ్ట్ గా పంపించారు. ఆమె ఆ బొమ్మ కారుతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలో క్లిన్ సరిగా కనిపించడం లేదు కానీ కల్కి 2898 ఏడీ మూవీలోని బుజ్జితోపాటు ఇతర టాయ్స్ కూడా అక్కడ చూడొచ్చు.

తమ పాపకు ఈ గిఫ్ట్ ఇచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఆల్ ద బెస్ట్ అని కూడా ఉపాసన విష్ చేసింది. స్వప్న దత్, ప్రియాంకా దత్ లను ట్యాగ్ చేసింది. కల్కి మూవీ ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తున్న మేకర్స్.. ఈ బుజ్జితో వాటిని మరో లెవల్ కు తీసుకెళ్లారు. ఇప్పుడిలా వాటి బొమ్మలను మార్కెట్లోకి రిలీజ్ చేసి.. ప్రమోషన్ల జోరును పెంచుతున్నారు.

కల్కి 2898 ఏడీ మూవీ గురించి..

కల్కి 2898 ఏడీ మూవీని ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. భారత పురాణాలకు ఆధునికతను జోడించి ఓ వినూత్నమైన కథ, కథనంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ మధ్యే భైరవ, బుజ్జికి చెందిన ఓ యానిమేటెడ్ సిరీస్ ను కూడా మేకర్స్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.

ఈ సిరీస్ ద్వారా అసలు భైరవ, బుజ్జి మధ్య బంధం ఎలా ఏర్పడింది? వాళ్ల సాహసాలు ఎలా సాగాయన్నది చూడొచ్చు. బుజ్జి అనే ఈ రొబోటిక్ కారును ప్రత్యేకంగా సినిమా కోసమే మహీంద్ర కంపెనీ సాయంతో తయారు చేసిన విషయం తెలిసిందే. దేశంలో వివిధ నగరాలు తిరుగుతున్న ఈ కారును ఎంతో మంది ఆసక్తికరంగా చూస్తూ దానితో ఫొటోలు దిగుతున్నారు.

సినిమాలో బుజ్జి పాత్రకు కీర్తి సురేశ్ వాయిస్ అందించడం విశేషం. కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు నటించారు. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024