OTT Releases This Week: ఓటీటీల్లోకి ఈవారం రానున్న సినిమాలు, సిరీస్‍లు: రెండు బాలీవుడ్ చిత్రాలు, ఓ మలయాళ హిట్‍ కూడా..

Best Web Hosting Provider In India 2024

OTT Movies Releases This Week: ఓటీటీల్లో కంటెంట్ చూడాలనుకునే వారి కోసం ఈ వారం కూడా భారీగానే సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేస్తున్నాయి. వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టున్నాయి. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన రెండు బాలీవుడ్ చిత్రాలు ఈవారంలో ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. మలయాళ సూపర్ హిట్ వర్షంగల్కు శేషం కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానున్న సినిమాలు, సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

నెట్‍ఫ్లిక్స్

బడే మియా చోటే మియా: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన యాక్షన్ మూవీ బడే మియా చోటే మియా చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.350కోట్ల భారీ బడ్జెట్‍తో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఇప్పుడు బడే మియా చోటే మియా సినిమా ఈ వారం జూన్ 6వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

షూటింగ్ స్టార్ట్స్ – ఇంగ్లిష్ మూవీ – నెట్‍ఫ్లిక్స్ – జూన్ 3

హిట్ మ్యాన్ – ఇంగ్లిష్ సినిమా – నెట్‍ఫ్లిక్స్ – జూన్ 7

హౌటూ రాబ్ ఏ బ్యాంక్ – ఇంగ్లిష్ సినిమా – నెట్‍ఫ్లిక్స్ – జూన్ 5

హిట్లర్ అండ్ నాజీస్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – జూన్ 5

స్వీట్ ట్రూత్ – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – జూన్ 6

సోనీ లివ్

వర్షంగల్కు శేషం: సూపర్ హిట్ అయిన మలయాళ మూవీ వర్షంగల్కు శేషం చిత్రం జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. మలయాళ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. ఈ వర్షంగల్కు శేషం జూన్ 7న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.

గుల్లక్ సీజన్ 4 – హిందీ వెబ్ సిరీస్ – సోనీ లివ్ – జూన్ 7

అమెజాన్ ప్రైమ్ వీడియో

మైదాన్: హైదరాబాదీ దిగ్గజ ఫుట్‍బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంపై మైదాన్ చిత్రం తెరకెక్కింది. ఈ బయోపిక్ మూవీలో అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ మైదాన్ చిత్రం జూన్ 5 లేకపోతే జూన్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

నేరుగా ఓటీటీలోకి బ్లాక్‍ఔట్

12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే హీరోగా నటించిన బ్లాక్‍ఔట్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం జూన్ 7వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

డిస్నీ+ హాట్‍స్టార్

ది లెజెండ్ ఆఫ్ ది హనుమాన్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ జూన్ 5వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

స్టార్ వార్స్: ది అకోలైట్ – వెబ్ సిరీస్ – హాట్‍స్టార్ – జూన్ 4

గునాహ్ – హిందీ వెబ్ సిరీస్ – హాట్‍స్టార్ – జూన్ 3

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024