Hyderabad News : హైదరాబాద్ లో విషాదం, గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

Best Web Hosting Provider In India 2024

Hyderabad News : హైదరాబాద్ లోని మైలర్దేవ్ పల్లి బాబుల్ రెడ్డి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. వర్షానికి నానిపోయిన ఓ గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పలువురు కూలీలు మైలార్దేవ్ పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటూ స్థానిక పారిశ్రామిక వాడలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఆ ప్రాంతంలోనే ఓ పాత గోడ దగ్గర నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఉన్నారు. ఆదివారం కురిసిన వర్షానికి ఆ గోడ నానిపోయింది. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలోనే గోడ ఒక్కసారే చిన్నారుల పై కూలింది. ఈ ప్రమాదంలో పది, పదకొండు సంవత్సరాలు ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ములుగులో మందు పాత్ర బ్లాస్ట్, వ్యక్తి మృతి

ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని కొంగలగుట్ట పైనా మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అదే మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇళ్లందులు యేసు చెరుకు కోసం కొంగల గుట్టపైన అటవీ ప్రాంతానికి మొత్తం ఐదుగురు మిత్రులు కలిసి వెళ్లగా అక్కడ ఎండిన చెట్లను నరుకుతూ ఉన్న క్రమంలో యేసు మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పైన కాలు వేశాడు. దీంతో అది పేలి యేసు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురు చిన్న గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్త పల్లి మండలం, వెన్న చెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం……గ్రామానికి చెందిన చింతకుంట సుధాకర్ ( 60), ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెన్న చెరువులోకి దిగగా…..కాలీకి వల్ల చుట్టుకొని నీటిలో గల్లంతయ్యాడు.రాత్రి ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం సుధాకర్ మృతదేహాన్ని గ్రామస్తులు చెరువులో గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point

టాపిక్

HyderabadTelangana NewsCrime TelanganaAccidentsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024