Miral Telugu OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

Miral Telugu OTT Release Date: మరో తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. నిజానికి నవంబర్, 2022లోనే తమిళంలో రిలీజైన ఈ సినిమా.. గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు మిరల్.

మిరల్ ఓటీటీ రిలీజ్ డేట్

మిరల్ ఓ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో భరత్, వాణి భోజన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఏడాదిన్నర కిందట తమిళంలో వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించినా.. సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. శక్తివేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గత నెల 17న తెలుగులోనూ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడా సినిమాకు ఊహించినంత రెస్పాన్స్ రాలేదు.

దీంతో మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ శుక్రవారం (జూన్ 7) నుంచే మిరల్ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీప్లే వెల్లడించింది. థియేటర్లలో అంతగా ఆడకపోయినా.. ఓటీటీ హక్కులను మాత్రం ఆహా పెద్ద మొత్తానికే కొనుగోలు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కూడా ఈ మిరల్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించాడు.

మిరల్ మూవీ గురించి..

బాయ్స్, ప్రేమిస్తే సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు భరత్. అతడు నటించిన ఈ మిరల్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైంది. ఈ సినిమాకు ప్రసాద్ ఎస్ఎన్ మ్యూజిక్ అందించాడు. ఇక మరో ప్రముఖ నటి వాణీ భోజన్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటించింది. ఇక జూన్ 7 నుంచే హన్సిక నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్ కూడా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

ఇక ఈ మధ్యే ఆహాలో మరో థ్రిల్లర్ మూవీ ప్రసన్న వదనం కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే కాదు ఏ ఓటీటీలో అయినా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మిరల్, 105 మినిట్స్ సినిమాలను ఆహా తమ ప్లాట్‌ఫామ్ లోకి తీసుకొస్తోంది.

ఈ వారం ఓటీటీ రిలీజెస్

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన రెండు బాలీవుడ్ చిత్రాలు ఈవారంలో ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. మలయాళ సూపర్ హిట్ వర్షంగల్కు శేషం కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. బడే మియా చోటే మియా సినిమా ఈ వారం జూన్ 6వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మైదాన్ చిత్రం జూన్ 5 లేకపోతే జూన్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

సూపర్ హిట్ అయిన మలయాళ మూవీ వర్షంగల్కు శేషం చిత్రం జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే హీరోగా నటించిన బ్లాక్‍ఔట్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024