
Best Web Hosting Provider In India 2024

Cantonment Assembly constituency Bypoll Result 2024 : కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
తాజా పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ స్థానానికి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున లాస్య నందతి సోదరి… నివేదిత బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన శ్రీ గణేశ్ పోటీ చేసి…. విజయం సాధించారు. ఈ విజయం ఫలితంగా అసెంబ్లీ కాంగ్రెస్ బలంగా సొంతంగానే 65కి చేరింది. బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్(Cantonment) నుంచి బీఆర్ఎస్ తరపున లాస్య నందిత విజయం సాధించారు. బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేశ్ కు 41 వేల ఓట్లు రాగా… నందితకు 59 వేలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 17,169 ఓట్ల తేడాతో నందిత విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్తె వెన్నల పోటీ చేయగా…20,825 ఓట్లు పొందగా మూడో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి వెన్నెలకు కాకుండా…. పార్టీలో చేరిన శ్రీ గణేశ్ కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
కంటోన్మెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్(BRS) సిట్టింగ్ స్థానం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుమార్తె లాస్య నందితకు(Lasya Nandita) బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించగా….ఆమె గెలుపొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో కంటోన్మెంట్ ఉపఎన్నిక అనివార్యమైంది. మరోసారి సాయన్న కుటుంబానికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆ పార్టీ అభర్థిగా నివేదితను ఖరారు చేశారు. మే 13న ఈ స్థానానికి పోలింగ్ జరిగింది.
ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో తెలంగాణ అసెంబ్లీలో బలం పెరిగింది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పార్టీ గెలిచిన ఏకైక స్థానం కూడా ఇదే అవుతుంది.
టాపిక్