Best Web Hosting Provider In India 2024
Naga Chaitanya Sobhita: నాగ చైతన్య.. సమంతతో విడిపోయిన తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే అతడు ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీళ్ల డేటింగ్ తెరపైకి వచ్చింది. యూరప్ వెకేషన్ లో ఈ ఇద్దరూ వైన్ టేస్ట్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగ చైతన్య, శోభితా వెకేషన్
నాగ చైతన్య, శోభితా మరోసారి కలిసి వెకేషన్ వెళ్లినట్లు తాజా ఫొటో నిరూపిస్తోంది. ఓ రెడిట్ యూజర్ షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వెకేషన్ లో భాగంగా ఓ చోట వైన్ టేస్ట్ చేస్తున్న సమయంలో వీళ్ల ఫొటో ఎవరో తీశారు. కొన్నాళ్ల కిందటి ఫొటో ఇది. ఇప్పుడు రెడిట్ యూజర్ బయటపెట్టడంతో మళ్లీ ఇద్దరి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.
“కొన్ని రోజుల కిందట నాగ చైతన్య, శోభితా యూరప్ లో ఓ వైన్ టేస్టింగ్ దగ్గర కనిపించారు” అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను సదరు యూజర్ షేర్ చేశాడు. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా ఇలా కలిసే తిరుగుతున్నారని మరో యూజర్ కామెంట్ చేశాడు. గతంలోనూ యూరప్ వీధుల్లో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫొటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
సమంతతో విడిపోయిన తర్వాత..
నాగ చైతన్య, సమంత విడాకులతో విడిపోయిన తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అయితే చైతూ మాత్రం శోభితాతో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ మధ్యే శోభితా కూడా దీనిపై స్పందించింది. జీక్యూ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ప్రేమలో ఉన్నారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.
“నేనెప్పుడూ ప్రేమలోనే ఉంటాను. ప్రేమ అనేది ఓ ఇంధనంలా పని చేస్తుంది. నాకు తెలిసి అదొక్కటే అవసరం, విలాసం కూడా” అని శోభితా చాలా తెలివిగా సమాధానమిచ్చింది. తమ మధ్య ఉన్న బంధం గురించి అటు చైతన్యగానీ, ఇటు శోభితాగానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. ప్రైమ్ వీడియోలో వచ్చిన మేడిన్ హెవెన్ వెబ్ సిరీస్ ద్వారా శోభితా ప్రేక్షకులకు దగ్గరైంది.
పలు వెబ్ సిరీస్, సినిమాల్లో బోల్డ్ సీన్లతో ఆమె రెచ్చిపోయింది. ఆ తర్వాత మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ నటించింది. ఈ మధ్యే మంకీ మ్యాన్ సినిమాలో నటించింది. మరోవైపు చాలా రోజులుగా హిట్ కోసం చూస్తున్న చైతన్య.. తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. అటు శోభితా సితార అనే సినిమా చేస్తోంది.