Raju Yadav OTT: ఓటీటీలోకి గెటప్ శ్రీను రాజుయాదవ్ సినిమా వచ్చేది ఆరోజేనా!

Best Web Hosting Provider In India 2024

Raju Yadav OTT: జబర్దస్త్ కామెడీ షోతో గెటప్ శ్రీను చాలా పాపులర్ అయ్యారు. చాలా చిత్రాల్లోనూ కమెడియన్‍గా నటించారు. అతడి యాక్టింగ్ టాలెంట్‍కు చాలా ప్రశంసలు దక్కాయి. గెటప్ శ్రీను సోలో హీరోగా తాజాగా రాజు యాదవ్ చిత్రం వచ్చింది. ఈ చిత్రం ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో రావటంతో ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది. అయితే, థియేటర్లలో అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. అయితే, రాజు యాదవ్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందో జబ్ బయటికి వచ్చింది.

ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

రాజు యాదవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమా జూన్ 22వ తేదీన ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. మరి జూన్ 22నే స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందేమో చూడాలి.

క్రికెట్ బంతి ముఖానికి తగిలి ఎప్పుడూ నవ్వుతూనే ఉండే డిజార్డర్‌కు గురయ్యే ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో రాజు యాదవ్ మూవీ వచ్చింది. ఈ చిత్రానికి కృష్ణమాచారి కే దర్శకత్వం వహించారు. హర్షవర్దన్ రామేశ్వర్, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

రాజు యాదవ్ మూవీలో గెటప్ శ్రీను సరసన అంకిత ఖారత్ హీరోయిన్‍గా నటించారు. ఆనంద చక్రవాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్, రాకెట్ రాఘవ కీలకపాత్రలు పోషించారు.

రాజు యాదవ్ చిత్రంలో కోసం మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్లను చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాకు, గెటప్ శ్రీనుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఈ మూవీ పర్ఫార్మ్ చేయలేకపోయింది. అనుకున్నట్టుగా వసూళ్లు రాలేదు.

రాజు యాదవ్ చిత్రాన్ని శ్రీవరుణ్వి క్రియేషన్స్ పతాకంపై రాజేశ్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. సాయి రామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరించారు.

స్టోరీ లైన్ ఇదే

రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ముఖానికి ఓ క్రికెట్ బంతి బలంగా తగులుతుంది. దీని ద్వారా ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉండే ఎక్స్‌ప్రెషన్‍ ఉండే డిజార్డర్ అతడికి వస్తుంది. దీంతో ఎప్పుడు నవ్వుతున్నట్టు కనిపిస్తాడు. ఇది తగ్గేందుకు సర్జరీ చేయించుకోవాలని వైద్యులు చెప్పినా.. డబ్బు లేక అతడు ఆగిపోతాడు. రాజు యాదవ్‍కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్వీటి (అంకిత ఖారత్) రాజ్ యాదవ్‍కు పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఆమెతో అతడు ప్రేమలో పడతాయి. అనంతరం రాజు యాదవ్ జీవితం ఎలా మారింది.. అతడి సమస్య తీరిందా.. ఎలాంటి పరిస్థుతులు ఎదుర్కొన్నాడనేదే ఈ మూవీలో ముఖ్యమన అంశాలుగా ఉన్నాయి. కథపరంగా ఆసక్తిగానే ఉన్నా ఈ చిత్రంలో స్క్రీన్‍ప్లే నిరాశపరిచిందనే కామెంట్లు వచ్చాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024