Chanakya Niti Telugu : ఈ అలవాట్లు ఉన్నవారు జీవితాంతం పేదలుగా ఉంటారు

Best Web Hosting Provider In India 2024

ఆచార్య చాణక్యుడి సూత్రాలు దశాబ్దాలుగా ప్రాచుర్యం పొందాయి. జీవితం గురించి ఆయన పేర్కొన్న సూత్రాలను అవలంబించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో విజయానికి మార్గాన్ని కనుగొనవచ్చు. అంతే కాకుండా ఈ సూత్రాలు వ్యక్తికి వ్యక్తిగతంగా సామాజికంగా, రాజకీయంగా సరైన దిశానిర్దేశం చేస్తాయి. మానవులకు హాని కలిగించే కొన్ని అలవాట్ల గురించి చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు.

వాస్తవానికి ఒక వ్యక్తి అలవాట్ల కారణంగా వారు జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. అయితే వారు అలాంటి అలవాట్లను గుర్తించలేరు, వాటిని వదులుకోలేరు. చాణక్య నీతి ప్రకారం.. వ్యక్తికి ఎలాంటి అలవాట్లు హానికరమో చూద్దాం..

ఆలోచన లేకుండా డబ్బు ఖర్చు చేయడం

ఆలోచన లేకుండా డబ్బు ఖర్చు చేయడం చాలా చెడ్డ అలవాటు. అలాంటి అలవాట్ల వల్ల వారికి సమస్యలు వస్తాయి. అలాంటి వ్యక్తులు భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయలేరు. ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేసేవారు అతి త్వరలో పేదలుగా మారతారని చాణక్యుడు చెప్పాడు. వారికి డబ్బు విలువ తెలియదు. దీంతో జీవితంలో వెనకాలే ఉండిపోతారు.

సోమరితనం

సోమరితనం మానవ ప్రగతికి అతి పెద్ద శత్రువు. సోమరితనం కారణంగా విజయం సాధించడానికి అనేక అవకాశాలను కోల్పోతారు. సోమరితనం కారణంగా వైఫల్యాలకు చింతించరు. అలాంటి వ్యక్తులు జీవితంలో మరింత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని చాణక్య నీతి చెబుతుంది.

శుభ్రంగా ఉండనివారు

చాణక్యుడు చెప్పిన ప్రకారం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే దంతాలు, బట్టలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించని వారు.. జీవితాంతం రోగాల బారిన పడి డబ్బు ఖర్చు చేస్తారు. అలాంటి వారు జీవితంలో ఎప్పుడూ కష్టాలు, బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాణక్యుడు కూడా వారి జీవితాలు ఎక్కువగా పేదరికంలోనే ఉంటాయని చెప్పాడు.

ఉదయం నిద్రలేవనివారు

చాణక్య నీతి ప్రకారం ఉదయం అత్యంత విలువైన సమయం. విజయాన్ని కోరుకునే వ్యక్తి ఎప్పుడూ ఉదయాన్నే లేవాలి. ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్రించే వారు ధనవంతులు కాలేరని చాణక్యుడు చెప్పాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిద్రించేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. ఎక్కువగా నిద్రపోవడం మానవ ఆరోగ్యానికి, అభివృద్ధికి మంచిది కాదు. చాణక్యుడు కూడా వారు ఎప్పుడూ పేదరికంలో జీవిస్తారని చెప్పారు.

మోసం

మోసం, తప్పుల ద్వారా డబ్బు సంపాదించే వారు ఎక్కువ కాలం ధనవంతులుగా ఉండరు. వారు త్వరలో డబ్బు కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. ధర్మమార్గాన్ని విడిచిపెట్టి, అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారితో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదని చాణక్యుడు వివరించాడు.

ఇతరులను బాధపెట్టేవారు

ఎప్పుడూ ఇతరులపై విరుచుకుపడే వ్యక్తులు, తప్పుగా మాట్లాడే చెడు అలవాటు ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తారు. అలాంటి వారితో ఎవరూ ఎక్కువ కాలం ఉండరు. దీనివల్ల విజయానికి అన్ని ద్వారాలు మూసుకుపోయి పేదరికంలోకి వెళ్తారని ఆచార్య చాణక్య నీతి చెబుతుంది. తమ మాటలతో ఇతరులను బాధపెట్టే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024