OTT: ఓటీటీలో దంచికొడుతున్న భయపెట్టే హారర్ సినిమా.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

The First Omen OTT Release: ప్రేక్షకులను ఎక్కువగా భయపెట్టే సినిమాలు హారర్ జోనర్‌కు చెందినవే. భయం అనేది సగటు మనిషికి ఉన్న ప్రధానమైన ఎమోషన్. అందుకే ఈ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా, సస్పెన్స్ అంశాలతో భయపెట్టే హారర్ సినిమాలను చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువగా క్యూ కడుతుంటారు.

ఇక ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టిన ఓటీటీ సంస్థలు దానికి తగినట్లే కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. హారర్, ఫాంటసీ, యాక్షన్, కామెడీ, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా సినిమాలను ఓటీటీ సంస్థలు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. అలా రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీనే ది ఫస్ట్ ఒమెన్. హాలీవుడ్ సినీ పరిశ్రమలో అనేక రకాల హారర్ మూవీస్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. వాటిలో ఒమెన్ ఫ్రాంఛైజీ కూడా ఒకటి.

ఈ ఫ్రాంఛైజీ నుంచి ఆరో సినిమాగా వచ్చిందే ది ఫస్ట్ ఒమెన్. ముందుగా ఈ సంవత్సరం ఏప్రిల్ 4న ఇటలీలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అనంతరం తర్వాతి రోజున అంటే ఏప్రిల్ 5న అమెరికాలో భారీగా విడుదలైంది. అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇటీవల మే 30 నుంచి ది ఫస్ట్ ఒమెన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ది ఫస్ట్ ఒమెన్ సినిమా ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు స్ట్రీమింగ్ లేదు. దాంతో తెలుగు ప్రాంతీయ భాషా రాష్ట్రాల్లో కాకూండా గ్లోబల్‌గా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. సినిమాలో హారర్ ఎలిమెంట్స్‌తో ప్రస్తుతం ఓటీటీలో దంచికొడుతోంది.

హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ది ఫస్ట్ ఒమెన్ ఒక మంచి ఆప్షన్. భాషతో సంబంధం లేదనుకుని మంచి హారిఫిక్ ఫీలింగ్ ఎక్స్‌పీరియనన్స్ చేయాలనుకునేవారు ఎంచక్కా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ది ఫస్ట్ ఒమెన్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా ఈ సినిమాకు అర్కాషా స్టీవెన్సన్ దర్శకత్వం వహించారు.

ది ఫస్ట్ ఒమెన్ సినిమాకు బెన్ జాకోబీ కథ అందించారు. ఇందులో టైగర్ ఫ్రీ, తౌఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగా, రాల్ఫ్ ఇనెసన్, బిల్ నైఘీ ఇతరులు ప్రధాన పాత్రలు పోషించారు. టిమ్ స్మిత్, కీత్ థామస్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 53.2 మిలియన్ డాలర్స్ రాబట్టి మంచి హిట్ అందుకుంది. ఇక ది ఒమెన్ ఫ్రాంఛైజీలో ది ఫస్ట్ ఒమెన్ మూవీ ఆరోది కాగా అన్నింటికంటే ముందుగా 1976లో వచ్చిన ది ఒమెన్ సినిమాకు ప్రీక్వెల్.

ది ఫస్ట్ ఒమెన్ మూవీ కథ విషయానికొస్తే.. రోమ్‌లోని ఒక చర్చిలో పని చేయడానికి ఒక అమెరికన్ మహిళ వస్తుంది. అక్కడ తన పుట్టుక గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో దెయ్యాలు, దుష్ట శక్తులు రావడం, ఆ కుట్ర గురించి తెలుసుకోవడం వంటివి సినిమాలో చూస్తాం. అలాగే ఇందులో వచ్చే ట్విస్టులకు నోరు వెళ్లబెట్టాల్సిందే.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024