Best Web Hosting Provider In India 2024
Chandrababu PC: ఏపీలో ఎంత మేరకు విధ్వంసం జరిగిందో తరచి చూస్తే తప్ప లోతు తెలియదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తొలి సారి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ వెళుతున్నట్టు చెప్పారు.
ఏపీలో మీడియాకు స్వాతంత్య్రం వచ్చిందని, ఆ తర్వాత ప్రజలకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. కాసేపట్లో ఢిల్లీ వెళుతున్నట్టు చెప్పారు. మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నానని చెప్పారు. మీడియా, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానని చెప్పారు. సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. ఒక రంగం, వ్యవస్థ కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో అన్నీ చూశామన్నారు.
ప్రజలు గెలవాలి,రాష్ట్రం నిలబడాలి, దీని కోసం ఎన్ని త్యాగాలైనా చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్ కోసం ముందుకు వెళ్లినట్టు చెప్పారు. పదో ఎన్నికను చూశానని, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళామన్నారు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, అధికారం అశాశ్వతం అన్నారు. ఎన్నో పార్టీలు, వ్యక్తులు కనుమరుగైపోతాయన్నారు.
ఇం తచారిత్రకమైన ఎన్నికలను ఎప్పుడు చూడలేదన్నారు. ఎన్నికల్లో వ్యతిరేకత కనిపించిందని, అమెరికాలో ఉండే వ్యక్తి కూడా ఐదారు లక్షలు ఖర్చు చేసి ఓటు వేయడానికి వచ్చారని, కడుపు నింపుకోడానికి పక్క రాష్ట్రాలకు వెళ్లిన వారు నేరుగా సొంత డబ్బులతో వచ్చారన్నారు. భోజనాలు ప్యాక్ చేసుకుని ఓట్లు వేయడానికి వచ్చారని, ఆ కమిట్‌మెంట్‌ను ఎలా అభినందించాలో తెలియడం లేదన్నారు. టీడీపీ చరిత్రలో, ఏపీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన చరిత్ర అన్నారు.
83లో గెలిస్తే 200సీట్లు వచ్చాయని, 94లో ప్రజా వ్యతిరేకత, ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల అపోజిషన్ స్టేటస్ లేకుండా సీట్లు వచ్చాయని, ఈసారి మాత్రం ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయన్నారు. దానికి కారణాలు అనుభవించిన ప్రజలకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును కోల్పోయారని, బతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ కోల్పోయారని, ఎన్నికల్లో ఎలా కలిశామో ప్రజలకు తెలుసన్నారు. ప్రతి సందర్భంలో బహిరంగ వేదికపై ప్రజలు గెలవాలన్నదే తమ అకాంక్ష
55.38శాతం 45.60శాతం టీడీపీకి, వైసీపీ 39.37శాతం ఓట్లు పడ్డాయని చంద్రబాబు చెప్పారు. ఒక్కో చోట 95వేల మెజార్టీ వచ్చిందని. ఛార్‌మినార్‌కు ఎక్కువ మెజార్టీ వచ్చేవని, కుప్పం, సిద్ధిపేటలో మెజార్టీ బాగా వచ్చేదని, ఈసారి 95, 94, 92, మంగళగిరిలో 91వేల మెజార్టీ వచ్చిందని ప్రజల తీర్పు, అహంకారం నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదనుకుంటే అది చేస్తామంటే ప్రజలు క్షమించరన్నారు.
ప్రజల గుణపాఠం, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి విధ్వంసకారులకైనా ఇదే గుణపాఠమన్నారు. ఐదేళ్లు కార్యకర్తలు పడిన ఇబ్బందులు, కంటి నిండి నిద్రలేని రాత్రులు గడిపిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. మనిషిని హింసిస్తూ ప్రాణంతో బ్రతకాలంటే జైజగన్ అనాలని చెబితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలాడని గుర్తు చేసుకున్నారు.
ఐదేళ్లు మీడియ పడిన ఇబ్బందులు, కోర్టుల చుట్టూ, సిబిసిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పుతూ వేధించడం చూసి ప్రజాస్వామ్యం తలదించుకోవాలన్నారు. ఎవరినైనా కొట్టొచ్చన్నట్టు వ్యవహరించవచ్చు అన్నట్టు ప్రవర్తించారన్నారు.
పవన్ కళ్యాణ్ చొరవతోనే…
సూపర్ సిక్స్ , ప్రజా గళం ప్రజల్లోకి బాగా వెళ్లాయన్నారు. ఓ వైపు టీడీపీ, మొదటి సారి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వకూడదని కూటమికి బీజం వేసిందుకు అభినందించారు. ఆ తర్వాత బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి అయ్యిందన్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని పై స్థాయి నుంచి ఇక్కడున్న పవన్, టీడీపీ నాయకత్వం వరకు నిజమైన చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. 175 సీట్లు, 25 పార్లమెంటు సీట్లలో అన్ని పార్టీల సీట్లుగా భావించి ఎన్నికలకు వెళ్లామన్నారు. తమపై చాలా బాధ్యత ఉందని చెప్పారు.
రాష్ట్రంలో 9సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, ఎందుకో పెంచారో ఎవరికి తెలియదని, కరెంటు మీద ఎంత డబ్బు తెచ్చారు, ఏ పేరుతో డబ్బులు తెచ్చారో తెలుసుకోవాలన్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. సంబంధం లేని డిపార్ట్‌మెంట్ నుంచిడబ్బులు తెచ్చి వేరే శాఖలకు ఇచ్చారని చెప్పారు.
నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాలకు ఎంతో బాధపడ్డానని చంద్రబాబు చెప్పారు. బాంబు దాడులకు కూడా తాను భయపడలేదని, తన కుటుంబంపై చేసిన దాడులకు, కౌరవ సభలో ఉండనంటూ, క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశానని, దానిని నిజం చేయడానికి ప్రజలు సహకరించారన్నారు. చాలా సార్లు ఎన్నికల్లో ఓడిపోతే కుంగిపోలేదని, గెలిచినపుడు గెంతులు వేయలేదని, వాటిని బాధ్యతగానే భావించినట్టు చెప్పారు.
తన కుటుంబానికి జరిగిన అవమానాలతో చెప్పిన మాటలకు నిలబెట్టుకునేలా చేసిన ప్రజలకు రుణం తీర్చుకుంటానని, వారి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత ప్రజలదే అన్నారు. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్ర నాయకుల్ని అభినందించారు. ఈ విజయం మూడు పార్టీల సమిష్టి విజయం అన్నారు.
ఎన్డీఏతోనే ప్రయాణం…
తాము ఎన్డీఏలోనే ఉన్నామని, దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలను చూశానని, ఎన్డీఏ సమావేశానికి తాను వెళుతున్నానని ఎలాంటి సందేహాలు వద్దని ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
టాపిక్