NNS June 5th Episode: మనోహరిని రోడ్డుపై వదిలేసిన అమ్ము.. బీహార్​ గ్యాంగ్​కి చిక్కిన మనోహరి.. అరుంధతికి చివరి ఘడియలు

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 5th June Episode) చేతి గాయం తగ్గేవరకు తను చెప్పింది విని కదలకుండా కూర్చోమని అమర్​కి చెప్పి విసురుగా బయటకు వస్తుంది మిస్సమ్మ. రూమ్​ బయటే నిల్చున్న రాథోడ్​ని చూసి ఆగుతుంది.

 

ఓ మాట అడగనా

ఆ మనోహరే నన్ను చంపేందుకు ప్లాన్ చేసింది రాథోడ్​, అందుకే నేను ఒంటరిగా గుడికి వెళ్లేలా ప్లాన్​ చేసింది. ఇక నుంచి తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది మిస్సమ్మ. అవును మిస్సమ్మ.. నువ్వు ఏం అనుకోనంటే అన్నగా ఒక మాట అడగనా.. అంటాడు రాథోడ్​. అడగమంటుంది మిస్సమ్మ.

నువ్వు నిజంగా ఓ రూమ్​మేట్​ అనుకునే మా సార్​కి ఇలా సేవ చేస్తున్నావా?.. అంటే.. ఇందాక సార్​కి దెబ్బ తగిలినప్పుడు నీ కళ్లలో నీళ్లు, బాధ చూస్తే నీకు ఆయన మీద ప్రేమ ఉందని అర్థమైంది. మీరిద్దరూ అనుకున్నట్లు మీ పెళ్లి అనుకోకుండా జరిగిన సంఘటన కాదనిపిస్తోంది. ఇది మీ తలరాతలో ఉంది. ఆయన జీవితంలో ఏర్పడిన లోటుని పూడ్చాల్సింది, ఆయన మనస్సుకి అయిన గాయానికి మందువి నువ్వే మిస్సమ్మ.. చెప్పాలనిపించింది చెప్పాను. తప్పుగా అనుకోకు అంటూ బాధగా అక్కడనుంచి వెళ్లిపోతాడు రాథోడ్​.

భయపడిన మనోహరి

తన ప్లాన్ నుంచి భాగీ తప్పించుకోవడం, అమ్ము తనకి వార్నింగ్​ ఇవ్వడంతో కోపంగా ఎక్కడికో బయల్దేరుతుంది మనోహరి. అప్పటికే మనోహరి సామానుతో పాటు కారెక్కి కూర్చుంటుంది అమ్ము శరీరంలో ఉన్న అరుంధతి. వాళ్లిద్దరూ వెళ్లడం చూసిన నీల వీళ్లిద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని ఆలోచనలో పడుతుంది. వెనక సీట్లో కూర్చున్న అమ్ముని చూసి భయపడుతుంది మనోహరి. ఎందుకు కార్లోకి ఎక్కావ్​ అని అమ్ముని అడుగుతుంది.

 

చెప్తాను కారు స్టార్ట్​ చేసి పోనివ్వు అంటుంది అమ్ము. ఇంక నువ్వు చేసింది చాలు.. మా ఇంట్లో ఉంటూ మాకు వెన్నుపోటు పొడిచింది నువ్వే అని తెలిసినా నిన్ను ఏం చేయకుండా వదిలేస్తున్నానంటే కేవలం మా అమ్మ కోసమే అంటూ ఓ చోట ఆపి మళ్లీ తన కంటికి కనిపించొద్దనీ, ఇంటికి రావొద్దని మనోహరికి వార్నింగ్​ ఇస్తుంది అమ్ము. తను ఇంకేం చేయనని, పెట్టింది తిని ఇంట్లో ఓ మూలన ఉంటానని వేడుకుంటుంది మనోహరి.

నీల కన్ఫ్యూజన్

పాముని పాలు పోసి పెంచినా తన బుద్ది మార్చుకోదని, నువ్వు మళ్లీ నా కంటికి కనిపించొద్దని చెప్పి వెళ్లిపోతుంది అమ్ము. చాలాసేపటి నుంచీ అమ్ము కనిపించట్లేదని ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. అమ్ము స్నేహితులందరికీ ఫోన్​ చేసి కనుక్కుంటాడు అమర్. అమ్ముని మనోహరి తీసుకెళ్లిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది నీల. అసలు పొద్దుట్నుంచీ అమ్ము ప్రవర్తనలో మార్పు ఉందని, మనోహరి ఆంటీపై అరిచిందని అమర్​తో చెబుతారు పిల్లలు.

ఇంతలో అమ్ము రావడంతో అందరూ సంతోషపడతారు. ఎక్కడికెళ్లావ్​ అని అమర్​ అడగగానే.. మన ఇంట్లోకి ఒక పురుగు వచ్చింది నాన్నా.. అది ఎవర్నీ కాటేయకముందే తీసుకెళ్లి బయట వదిలేసి వస్తున్నా. మళ్లీ తిరిగి వచ్చే వీలు లేకుండా దూరంగా పడేశా అందుకే లేటయ్యింది అంటూ లోపలకు వెళ్తుంది అమ్ము. అందరూ లోపలకు వెళ్లడంతో రాథోడ్​తో అమ్ము మాట, నడక, ప్రవర్తన చూస్తుంటే తనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తిని చూస్తున్నట్లు ఉంది అంటుంది భాగీ.

 

మా అమ్మగారి పోలికలు

అవి మా అమ్మగారి పోలికలు అంటాడు రాథోడ్​. అసలు ఆమెని తానెప్పుడూ చూడలేదని, కానీ అమ్ముని చూస్తుంటే అలా అనిపించట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది మిస్సమ్మ. పౌర్ణమి ఘడియలు పూర్తయ్యే సమయం ఆసన్నమవడంతో పిల్లల్ని చూసి బాధపడుతుంది అరుంధతి. నా చేత్తో ఎలాగు వండి పెట్టలేను కనీసం వాళ్లకి తినిపిస్తాను అనుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్లి నాకు ఆకలేస్తుంది తిందామా అని అడుగుతుంది అమ్ము రూపంలో ఉన్న అరుంధతి.

అంజు పెయింటింగ్ వేస్తోందని ఆకాష్​, ఆనంద్​ అనడంతో తానే ప్లేట్లో పెట్టి అందరికీ తినిపిస్తుంది. అమ్ము వెళ్లగానే పిల్లలంతా ఆశ్చర్యపోతూ అమ్ముని చూస్తుంటే అచ్చం అమ్మలాగే అనిపిస్తోందని, అమ్మ చెప్పినట్లే కబుర్లు చెబుతూ అన్నం పెట్టిందని అనుకుంటారు. అమ్ము తనని ఎందుకు రోడ్డుమీద వదిలేసి వెళ్లిందో అసలు తను చేసినవన్నీ అమ్ముకి ఎలా తెలిసాయో అర్థంకాక ఆలోచనలో పడ్తుంది మనోహరి.

బీహార్ గ్యాంగ్‌కు దొరికిన మనోహరి

ఏదో ఒకటి చేయాలనుకుంటూ కారెక్కిన మనోహరికి బీహారి గ్యాంగ్​ ఎదురుగా వచ్చి షాకిస్తుంది. తప్పించుకోవాలని చూసినా, నాకు రావడం కుదరదు కొంచెం టైమ్ కావాలని మనోహరి బతిమాలినా వినకుండా కారెక్కించుకుని తీసుకుని వెళ్తారు.

 

బీహారీ గ్యాంగ్​ నుంచి మనోహరి ఎలా తప్పించుకుంటుంది? పౌర్ణమి ముగిసేలోపు అరుంధతి అనుకున్నది సాధిస్తుందా?​ అనే విషయాలు తెలియాలంటే జూన్​ 06న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024