OTT Web Series: ఓటీటీలో రికార్డు సృష్టించిన వెబ్ సిరీస్.. తొలి వారమే భారీగా వ్యూస్

Best Web Hosting Provider In India 2024

Panchayat Season 3 OTT: పంచాయత్ వెబ్ సిరీస్‍కు సూపర్ పాపులారిటీ ఉంది. ఈ సిరీస్‍లో 2020లో వచ్చిన తొలి సీజన్, 2022లో వచ్చిన రెండో సీజన్ దుమ్మురేపాయి. విలేజ్ కామెడీ డ్రామాతో ఈ సిరీస్ చాలా మంది మనసులను గెలుచుకుంది. దీంతో మూడో సీజన్‍పై విపరీతమైన హైప్ వచ్చింది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ గత వారం మే 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అంచనాలను మించి తొలి వారం వ్యూస్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఓ రికార్డు కూడా సాధించిందని ఈ సిరీస్ మేకర్స్ ప్రకటించారు.

రికార్డు ఇదే

పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్‍కు తొలి వారం రోజుల్లోనే 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తొలి వారం అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‍/సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ఈ సిరీస్ నిర్మించిన ది వైరల్ ఫీవర్ (TVF) ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది.

పంచాయత్ మూడో సీజన్ మనసులను గెలుస్తూ.. రికార్డులను బ్రేక్ చేస్తోందని టీవీఎఫ్ ట్వీట్ చేసింది. తొలి వారంలోనే 12 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ ప్లేస్‍లో ఉందనిపేర్కొంది. తొలి వారం అత్యధిక వ్యూస్ రికార్డుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా ట్వీట్ చేసింది.

పంచాయత్ మూడో సీజన్ మే 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాగా.. తర్వాతి రోజు నుంచి ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చింది. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ జోరు మరింత కాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫులేరా గ్రామ పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠిగా మరోసారి జితేంద్ర కుమార్ అద్భుతంగా నటించారు. ఈ సీజన్‍లో రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, ఫైజల్, మాలిక్, చందన్ రాయ్, సాన్వికా, దుర్గేశ్ కుమార్, పంకజ్ జా కీలకపాత్రలు పోషించారు.

పంచాయత్ వెబ్ సిరీస్‍కు చందన్ కుమార్ కథ అందించగా.. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. మూడో సీజన్‍లోనూ ఈ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఈ సీజన్‍ను కూడా మనసుకు హత్తుకునేలా దీపక్ తెరకక్కించారు. అనురాగ్ సైకియా సంగీతం అందించారు.

రాజకీయాలతో మూడో సీజన్

ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన గ్రామ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్)ను మళ్లీ ఫులేరాకు తీసుకురాడంతో పంచాయత్ మూడో సీజన్ షురూ అయింది. గత రెండు సీజనల్లో ఎక్కువగా కామెడీ ఉండగా.. ఇప్పుడు ఈ మూడో సీజన్‍లో అధికంగా గ్రామ రాజకీయాలు ఉన్నాయి. కామెడీ కాస్త తగ్గినా ఎమోషన్లు బాగున్నాయి. ఫులేరా పాలిటిక్స్ కూడా ఆకట్టుకుంటాయి. దీంతో పంచాయత్ మూడో సీజన్‍కు మంచి ఆదరణ దక్కుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ హిందీ ఆడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ ఉన్నాయి.

పంచాయత్ నాలుగో సీజన్ కూడా రావడం ఖరారైంది. ఫులేరాలో గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టూ ఆ సీజన్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో నాలుగో సీజన్‍పై కూడా మంచి హైప్ ఉంటుంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024