ఎవరు రెచ్చగొట్టినా…సంయమనంగా..ధైర్యంగా ఉండాలి

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయ‌కుడు పేర్ని కిట్టు
 

కృష్ణాజిల్లా : ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ కృష్ణాజిల్లా వైయ‌స్ఆర్‌సీపీ యువ నేత పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటామన్న పేర్ని కృష్ణమూర్తి..  గెలుపు , ఓటములు సహజం కార్యకర్తలు అధైర్యపడొద్దు ..అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరు రెచ్చగొట్టినా…సంయమనంగా..ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ఫలితాల మాట్లాడిన పేర్నికృష్ణ మూర్తి మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లురవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మంచి పరిపాలన కొనసాగించాలని కోరుతున్నా. పోర్టు పనులు వేగవంతం చేయాలి. మెడికల్ కాలేజీకి కావాల్సిన వసతులు కల్పించాలి. 
 
మీరు ఇచ్చిన ప్రతీ హామీని ప్రజలతో పాటు మేం కూడా బాగా గుర్తుంచుకుంటాం. ఏడాది తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను మళ్లీ గుర్తుచేస్తాం. ఎల్లప్పుడూ ప్రజలకు మేం అండగా ఉంటాం. మంచి చేస్తే మిమ్మల్ని అభినందిస్తామ‌ని  పేర్ని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. 

Best Web Hosting Provider In India 2024