Brahmamudi June 6th Episode: బ్రహ్మముడి- చావు బతుకుల్లో మాయ- రాజ్ పెళ్లికి ఒక్కరోజే- బాధలో కావ్య- దొరికిపోయిన ఇంటిదొంగ

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అసలు మాయను హాస్పిటల్‌లో డాక్టర్ చూస్తుంది. అది మీ ఫ్యామిలీకి చేసిన మోసానికి ఆ దేవుడు దానికి దారుణమైన చావు రాసిపెట్టాడు అని అప్పు అంటుంది. ఆ దేవుడు శిక్ష వేసింది మాయకు కాదు.. నాకు అని కావ్య ఏడుస్తూ చెబుతుంది. మా అత్తగారు మా ఆయనకు ఆ దొంగమాయకు పెళ్లి చేయడానికి రేపే ముహుర్తం పెట్టించారు అని కావ్య ఏడుస్తూ అంటుంది.

 

చావు బతుకుల్లో మాయ

కట్ చేస్తే తనకు ఎలా ఉందని డాక్టర్‌ను అడుగుతుంది కావ్య. కండిషన్ అయితే సీరియస్‌గానే ఉంది. ఇప్పుడేం చెప్పలేం అని డాక్టర్ అంటుంది. దాంతో మరింత బాధపడిపోతుంది కావ్య. ఐసీయూ దగ్గరికి వెళ్లి మాయను చూస్తుంది కావ్య. చావు బతుకుల్లో ఉన్న మాయను చూసి ఏం చేయాలో అర్థం కాక కావ్య ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

బ్రహ్మముడి బుధవారం ఎపిసోడ్‌లో రాజ్ వెంట పడటం చూసి కావ్య అప్పు ఓ కూరగాయల అతని వద్ద ఆగుతారు. ఇక లాభం లేదే.. ఆయన మనల్ని వదిలేలా లేరు. నువ్ వెళ్లి మాయ ఇంటి దగ్గర వెయిట్ చేయు అని అప్పును పంపిస్తుంది కావ్య. తర్వాత రాజ్ దగ్గరికి వెళ్లి మీరేంటీ ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇక్కడ కూరగాయలు బాగుంటాయని అమ్మ చెప్పింది అందుకే వచ్చాం అని కావ్య అంటుంది.

ఏ తద్ధినం చేస్తావో అని

కానీ, కాకరకాయల ధర బాగా చెబుతున్నాడు. అందుకే అప్పును పంపించాను అని కావ్య అంటుంది. అమ్మో.. అమ్మో.. నువ్ చెప్పేది అబద్ధం అని బాగా తెలుసే. మూడు కిలోమీటర్లు తిప్పావే. దాహం వేస్తే నీళ్లు కొనుక్కోడానికి డబ్బులు లేక విలవిల్లాడిపోయాను తెలుసా. నువ్ ఏదో పెళ్లి ఆపేస్తాను. పొడిచేస్తాను అన్నావ్ కదా. నువ్ ఏ తద్ధినం చేస్తావో అని ఫాలో అయ్యానే అని రాజ్ అంటాడు. అందుకే నండి ఇలా వీధి వీధి తిరుగుతున్నాను. గుడి చుట్టు 108 ప్రదక్షిణలు చేస్తే అన్ని దూరం అవుతాయి అని కావ్య అంటుంది.

 

అమ్మా తల్లి నువ్వే ఆ ప్రదక్షిణలు సైలెంట్‌గా చేసుకో.. నేను వెళ్లి సౌండ్ వచ్చేలా ఏడుస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు ఇంటి బయటకు వచ్చిన కావ్య డ్రైవర్ గురించి తల్లిని అడుగుతుంది. ఇంతసేపు ఏంటీ.. ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్‌గా ఉందని కాల్ కట్ చేస్తుంది అనామిక. ఇంతలో అక్కడ స్వప్న కనిపించేసరికి అవాక్కవుతుంది. ఎవరైనా చూస్తారని టెన్షన్ పడుతున్నావా. ఏ బాగోతం చూస్తారని స్వప్న అంటుంది.

పేగులు లెక్కపెట్టే రకం

నువ్ ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అనామిక అడుగుతుంది. నేను ఎక్కడ ఉంటే నీకెందుకే అని స్వప్న అంటే.. అమ్మో అది ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం. వాడొస్తే స్వప్న చూస్తే చెక్ ఎలా ఇచ్చేది అని చెక్‌ను దాచుకుంటుంది అనామిక. నన్ను కాస్తా వదిలేయ్ అని అనామిక అంటే.. నేనేంటీ కల్యాణే నిన్ను వదిలేశాడు అని స్వప్న పంచ్‌లు వేస్తుంది. నీ పని అనుమానంగా ఉంది. అందుకే డిటెక్టివ్‌లా నీ వెంట పడ్డాను. అదేంటో తేల్చుకునేదాకా వెళ్లను అని స్వప్న అంటుంది.

ఏంటీ వెనుక ఏదో దాచావ్ అని స్వప్న అనామిక దగ్గరున్న చెక్‌ను లాక్కుంటుంది. చెక్ మీద పది లక్షలు అని రాసి ఉండటం, దానిమీద అనామిక తండ్రి పేరు ఉండటంతో ఇది మీ అయ్య పేరులా ఉంది. వాడేం తండ్రే అమ్మాయికి ఇవ్వాల్సిందిపోయి నీ దగ్గరి నుంచి తీసుకుంటున్నాడు అని అనామిక అంటుంది. నేను ఈ ఇంటి అయోడిన్ సాల్ట్ తింటున్నానులే. ఈ డబ్బు కల్యాణ్‌ను అడిగావా.. మీ అత్త మామలను అడిగావా అని స్వప్న అడిగితే.. అనామిక సైలెంట్‌గా ఉంటుంది.

 

ఇంటిదొంగను లాక్కురావాలి

నువ్ మా అమ్మను, అప్పును, కావ్యను చాలా మాటలు అన్నావే. అప్పటి నుంచి నాకు రగిలిపోతుంది. ఇన్నాళ్లకు నీ జుట్టు నాకు చేజిక్కిందే. ఇంకెందుకు వదిలిపెడతానే.. దా.. ఇంట్లో వాళ్ల ముందు బాంబ్ పేలుస్తాను ఇంట్లోవాళ్ల ముందుకు లాక్కొస్తుంది స్వప్న. ఏమైంది.. అలా లాక్కొస్తున్నావ్ అని అపర్ణ అంటుంది. ఇంటిదొంగను ఇలాగే లాక్కురావాలి అని స్వప్న అంటుంది. ఏంటమ్మా ఇంటి కోడలిని అంత మాటన్నావ్ అని ఇందిరాదేవి అంటుంది.

ఇది చూస్తే అర్థం అవుతుందని చెక్ చూపిస్తుంది. దాంతో అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. దాంతో జరిగింది చెబుతుంది స్వప్న. ఇన్నాళ్లు మా కావ్య అత్తింటి డబ్బు పుట్టింటికి చేరవేస్తుందని అన్నారు. మరి ఇప్పుడు అనామిక చేసిందేంటీ. మా కావ్య పుట్టింటికి బొమ్మలు చేసి ఆర్డర్ పూర్తి చేసి సహాయం చేసింది. రాజ్ సహాయం చేస్తానన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మేము పేదింటి వాళ్లమే కానీ మాకు ఓ క్యారెక్టర్ ఉంది అని స్వప్న అంటుంది.

దొంగతనం చేసింది

అనామిక గొప్పింటి నుంచి వచ్చిందని వీళ్ల అత్త గొప్పలు చెబుతుంది కదా. మరి ఈమె క్యారెక్టర్ ఏంటీ. దానికి మీరు ఏం చెబుతారు అని స్వప్న అంటుంది. నీకు అవసరం ఉంటే ఇంట్లో వాళ్లను అడగాలి. ఎవరికీ చెప్పకుండా ఇలా డబ్బు పంపించడం మంచి పద్ధతేనా అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. ఇది కల్యాణ్ ముందు తేల్చాలి అని అపర్ణ అంటే.. స్వప్న పిలుస్తుంది. కల్యాణ్ వస్తాడు. ఏమైంది పెద్దమ్మా అని కల్యాణ్ అడిగితే.. ఈ చెక్ మీద సంతకం నువ్వే చేశావా అని అడుగుతుంది అపర్ణ.

 

ఈ సంతకం నాదే కానీ ఇది అనామిక తండ్రికి రాయడం ఏంటీ అని కల్యాణ్ అంటాడు. అయితే నువ్ ఈ చెక్ రాయలేదా అని అపర్ణ అడుగుతుంది. ఇది అకౌంటెంట్ సంపత్‌కి ఇవ్వాలని సైన్ చేసి పెట్టాను అని కల్యాణ్ అంటాడు. నీ భార్య నీకు తెలియకుండా చెక్ దొంగతనం చేసి వాళ్ల నాన్న పేరు రాసి ఇంటికి పంపిస్తుంది. అది నేను గమనించి నీ ముందు రెడ్ హ్యాండెడ్‌గా పెట్టాను అని స్వప్న అంటుంది. నీకు కష్టమొస్తే నేను ఆదుకోనా. ఇలా సిగ్గులేకుండా ఎలా చేశావ్ అని కల్యాణ్ అంటాడు.

ధాన్యలక్ష్మీ సపోర్ట్

కూతురు చేత ఇలా సిగ్గులేని పని చేయించిన ఆ తల్లిదండ్రులను అనాలి అని స్వప్న అంటే.. ధాన్యలక్ష్మీ ఎంట్రీ ఇచ్చి అరుస్తుంది. ఏం హక్కు ఉందని నా కోడలిపై అరుస్తున్నావ్ అని ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. దొంగను దొంగే అంటారు పోలీస్ కాదు అని స్వప్న అంటే నోర్మూయ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. సరే ఈ ఇంటి పెద్ద ఇక్కడే ఉంది. ఆమె సమక్షంలోనే అడుగుతున్నాను. కల్యాణ్ రాసిన చెక్ ను ఎందుకు తీసుకెళ్తుంది. దీన్ని ఏమంటారు అని అపర్ణ అడుగుతుంది.

 

అంటే అంతా కలిసి ఇంటి కోడలిని దొంగను చేస్తారా. ఏం జరిగిందో తెలియకుండా ఎలా అంటారు. ఆ చెక్ అనామిక తీసుకోలేదు. నేను ఇచ్చాను అని ధాన్యలక్ష్మీ అబద్ధం చెబుతుంది. వాళ్ల నాన్న డబ్బు అడ్జస్ట్ కాకా నన్ను అడిగితే నేను ఇచ్చాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి చూశావా అన్నట్లుగా అనామిక చూస్తుంది. అంతా బాగానే ఉంది మరి ఇందాకా నాకు ఎదురుపడినప్పుడు చెప్పకుండా ఎందుకు కంగారు కంగారుగా వెళ్లిందో నీకే తెలియాలి అని కల్యాణ్ వెళ్లిపోతాడు.

నగలు జాగ్రత్త

మీరు బాగానే వెనుకేసుకొచ్చుకున్నారు. మీ నగలు కూడా జారవేస్తుంది జాగ్రత్త అని స్వప్న వెళ్లిపోతుంది. అపర్ణ, ఇందిరాదేవి కూడా వెళ్లిపోతారు. అనామికను కోపంగా చూస్తుంది ధాన్యలక్ష్మీ. సైలెంట్‌గా అనామిక వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు దగ్గరికి కారులో వస్తుంది కావ్య. కావ్య వెంటే కారులో రుద్రాణి వస్తుంది. ఇదే ఇల్లు అని లోపలికి వెళ్తారు అప్పు, కావ్య. రుద్రాణి కూడా ఫాలో అవుతుంది. వెళ్లి డోర్ కొడితే మాయ ఫ్రెండ్ తలుపు తీస్తుంది.

మాయను పిలుస్తావా అని అప్పు అడిగితే.. ఇంకా రాలేదు అని సాహితి చెబుతుంది. అప్పుడు సాహితితో అప్పు గొడవ పడుతుంది. ఇంతలో మాయ ఎదురుగా వస్తుంది. కావ్య, అప్పును చూసి మాయ షాక్ అవుతుంది. కావ్యకు అనుమానం వస్తుంది. కావ్య అని మాయ అని పిలుస్తుంది. నేనెవరో తెలిసిపోయింది కాబట్టి పరిచయాలు అనవసరం. కాబట్టి నేను అడిగిన వాటికి మర్యాదగా నిజాలు చెప్పు. ఇప్పటివరకు నువ్ ఏం చేశావో నిజాలు చెప్పు. ఇక్కడ ఇంటికి వచ్చి చెప్పాలి అని కావ్య అంటుంది.

 

కావ్యకు భయపడిన మాయ

దాంతో సూట్ కేస్ వదిలేసి మాయ పారిపోతుంది. అది చూసి కావ్య, అప్పు షాక్ అవుతారు. మాయను పట్టుకునేందుకు పరుగెడుతారు. ఇది పారిపోతుందంటే కావ్యను చూసి భయపడిపోతుందన్నమాట. ఇది అస్సలు కావ్యకు దొరకకూడదు అని కారు స్టార్ట్ చేస్తుంది రుద్రాణి.

IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024