Viral: ఈమె అందం భరించడం ఏం మగవాడి తరం కాదు, అందుకే ఈమె సింగిల్‌గా మిగిలి పోయిందట

Best Web Hosting Provider In India 2024

Viral: అందంగా ఉండడం దేవుడిచ్చిన వరం. కళ్ళు తిప్పుకోలేని అందంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వారెందరో. అయితే ఒక అమ్మాయి మాత్రం తన అందమే తనకు శాపం అయిందని చెబుతోంది. తన అందాన్ని చూసి… ఇంతటి అందం భరించలేమంటూ మగవారు అంతా పారిపోతున్నారని అంటోంది. ఆమె పేరు ఆష్లే. ఫ్యాషన్ స్టైలిస్ట్ గా పని చేస్తోంది. ఆమె టిక్ టాక్ లో చాలా ఫేమస్. ఆమె ఎంత అందంగా ఉంటుందంటే చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఇంతవరకు ఆమెతో ఏ అబ్బాయి కూడా డేటింగ్ చేయలేదు. తాను సింగిల్ గానే ఉన్నానని చెబుతోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తనను ఇష్టపడి తన వెనక పడే అబ్బాయిలే లేరని అని నిరాశగా చెబుతోంది ఆష్లే. తనను చూసి మైమరిచిపోతారు… కానీ ఇంత అందంగా ఉన్న అమ్మాయి తమ ప్రేమను ఒప్పుకోదులే అని ఎంతోమంది మగవారు స్వచ్ఛందంగానే ఆగిపోతున్నారని చెబుతోంది. ఆమెకు సహజంగానే ఎంతో అందమైన చర్మం వచ్చింది. దానికి కాస్త మెరుపుల మేకప్ చేస్తే ఇక అందాన్ని భరించడం ఎవరి తరం కాదట. అందుకే ఎంతోమంది పురుషులు ఆమెను దూరం నుంచి చూస్తూ ఆరాధిస్తున్నారు, కానీ వారి మనసులోని మాటలు మాత్రం బయట పెట్టడం లేదు. చెప్పినా కూడా అంత అందగత్తె తమను ఒప్పుకోదులే అనుకుంటున్నారట.

ఆష్లే తన సోషల్ మీడియా ఖాతాలో ‘నేను సింగిల్ గానే మిగిలిపోయాను, ఎంతో ఒంటరిగా ఉన్నాను’ అంటూ చెప్పుకోస్తోంది. టిక్ టాక్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ‘నేను అందంగా ఉన్నా ఇప్పటికీ సింగిల్ జీవితాన్నే గడుపుతున్నాను’ అంటూ బాధపడుతోంది.

ఆష్లే అందమైన అమ్మాయి మాత్రమే కాదు, చాలా తెలివైన అమ్మాయి కూడా. ఫ్యాషన్ స్టైలిస్ట్ గా తన రంగంలో చక్కగా రాణిస్తోంది. ఆమె వీడియోలలో యాంకర్ గా పనిచేస్తుంది. ఆమె ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే, కానీ ఎవరూ ఆమె దగ్గరికి వెళ్లి ప్రేమను వ్యక్తపరచరు. కొంతమంది మాత్రం… ఆ అందం వల్ల ఆమె అహంకారిగా మారిందని అంటారు. అలాగే ఆమెకు ఇతరులు కన్నా తన మీద తనకే శ్రద్ధ ఎక్కువని, అందుకే ఆమె సింగిల్ గా మిగిలిపోయింది అని వాదించే వారు కూడా ఉన్నారు.

ఆష్లే మాత్రం తనను ఆరాధించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఎవరో ఒకరు ధైర్యం చేసి తనతో డేటింగ్ చేస్తారని ఆశిస్తోంది. తనకు తానుగా మాత్రం ఏ మగవాడికి ప్రపోజ్ చేయనని, మగవారే ధైర్యంగా తన ముందుకు వచ్చి చెబితే, అతనితో డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని… టిక్ టాక్ వీడియోలో వివరిస్తోంది. ఈమె అమెరికాలో జీవిస్తోంది. అక్కడ టిక్ టాక్ పై ఎలాంటి నిషేధం లేదు.

ఆష్లే సమస్యను ‘ప్రెట్టీ ప్రివిలేజ్’ కాన్సెప్ట్ గా చెప్పుకోవచ్చు. గత ఏడాదే ఈ కాన్సెప్ట్ ఆన్ లైన్లో చర్చలకు దారితీసింది. అందంగా ఉండడం వల్ల లభించే లాభాలు, సానుకూలతలతో పాటూ ప్రతికూలతలను కూడా ఈ ప్రెట్టీ ప్రివిలేజ్ అంశం హైలైట్ చేస్తుంది. కొందరికి అందం ఎంతో మేలు చేస్తే, మరికొందరికి ప్రతికూలతలను అందిస్తుంది. ఆష్లేకు అందమే ప్రతికూలంగా మారింది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024