Netflix Top movies: నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాలు ఇవే.. రికార్డులు బ్రేక్

Best Web Hosting Provider In India 2024

Netflix Top movies: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మధ్య కొన్ని ఇండియన్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. కొన్ని నెలలుగా టాప్ ట్రెండింగ్ మూవీస్ లోనూ ఈ సినిమాలే ఉంటున్నాయి. వాటిలో చాలా వరకూ ఈ ఏడాది ఈ ఓటీటీలోకి వచ్చిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలను మీరు చూసి ఉండకపోతే వెంటనే ఈ వీకెండ్ ప్లాన్ చేసేయండి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన సినిమాలు

లాపతా లేడీస్

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన లాపతా లేడీస్.. నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. గతంలో యానిమల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. మహిళా సాధికారత అంశాన్ని సరదా కథనంతో మనసుకు హత్తుకునేలా తీసిన ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో రెండో స్థానంలో ఉంది.

సైతాన్

అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక నటించిన హారర్ థ్రిల్లర్ మూవీకి కూడా నెట్‌ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో టాప్ కలెక్షన్ల సినిమాల్లో ఒకటైన సైతాన్ ఓటీటీలోనూ భయపెడుతోంది. ముఖ్యంగా మాధవన్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది.

క్రూ (Crew)

బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, టబు, కృతి సనన్ నటించిన క్రూ మూవీ ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాల్లో ఒకటి. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ లోనూ ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది చూసిన సినిమాల్లో ఈ క్రూ కూడా ఉంది.

యానిమల్

గతేడాది డిసెంబర్ లో రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించింది. లాపతా లేడీస్ వచ్చే ముందు వరకు ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన హిందీ సినిమాగా నిలిచింది.

డంకీ

గతేడాది చివర్లో ప్రభాస్ సలార్ కు పోటీగా రిలీజైన డంకీ మూవీకి థియేటర్లలో అంతగా ఆదరణ లభించలేదు. అయితే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం సక్సెసైంది. ఎక్కువ మంది చూసిన సినిమాల్లో ఒకటిగా ఈ షారుక్ మూవీ నిలిచింది.

భక్షక్

ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ నటించిన మూవీ భక్షక్. నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోనే రిలీజైన ఈ సినిమా మనుషుల అక్రమ రవాణా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ తిరిగి ఆకట్టుకుంది. ఇందులో భూమి నటనకు చాలా మంది ఫిదా అయ్యారు.

మర్డర్ ముబారక్

నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన మరో మూవీ మర్డర్ ముబారక్. పంకజ్ త్రిపాఠీ, కరిష్మా కపూర్, సారా అలీ ఖాన్, విజయ్ వర్మలాంటి వాళ్లు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా.. బాగానే చూశారు.

ఫైటర్

హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ మూవీ.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టినప్పటి నుంచీ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ నుంచి బయటకు వెళ్లలేదు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024