Palak Egg Masala: పాలకూర కోడిగుడ్డు మసాలా కూర, తిన్నారంటే నోరూరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Palak Egg Masala: కోడిగుడ్డు కూరలు అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. దీంతో చేసే మసాలా కర్రీ వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది. ఇక్కడ మేము పాలక్ అండా మసాలా రెసిపీ ఇచ్చాము. పాలకూర కోడిగుడ్డు మసాలా కర్రీని ఒక్కసారి వండుకొని చూడండి. కొత్తగా, రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సాధారణ కోడిగుడ్డు కూరతో పోలిస్తే ఈ పాలక్ అండా మసాలా కర్రీలో పోషకాలు కూడా అధికం. దీన్ని చేయడం చాలా సులువు.

పాలకూర కోడిగుడ్డు మసాలా కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పాలకూర – మూడు కట్టలు

కోడిగుడ్లు – నాలుగు

పచ్చిమిర్చి – రెండు

నెయ్యి – రెండు స్పూన్లు

నూనె – రెండు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

ఉల్లిపాయ – ఒకటి

కారం – ఒక స్పూను

పసుపు – అర స్పూను

ధనియాల పొడి – ఒక స్పూను

జీలకర్ర – ఒక స్పూన్

ఎండుమిర్చి – రెండు

గరం మసాలా – ఒక స్పూను

బిర్యానీ ఆకు – ఒకటి

పాలకూర కోడి గుడ్డు మసాలా కర్రీ రెసిపీ

1. పాలకూరను సన్నగా తరిగి పరిశుభ్రంగా కడుక్కోవాలి.

2. వాటిని ఒక గిన్నెలో వేసి కాస్త నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి.

3. ఈ పాలకూర తరుగును చల్లారాక పచ్చిమిర్చితో కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక బిర్యానీ ఆకును వేయించుకోవాలి.

5. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను, అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి వేయించాలి. ఇవి బాగా రంగు మారేవరకు వేయించుకోవాలి.

6. ఆ తర్వాత పాలకూర పేస్టును వేసి బాగా కలుపుకోవాలి.

7. అది ఐదు నిమిషాలు పాటు ఉడికాక గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

8. చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత పావు కప్పు నీళ్లను వేసి ఉడికించాలి.

9. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను రెండు లేదా నాలుగు ముక్కలుగా కోసి ఆ మిశ్రమంలో వేయాలి. కోయకుండా వేసుకున్న మీ ఇష్టమే.

10. మూత పెట్టి ఇతరుల అయ్యే వరకు ఉడికించుకోవాలి.

11. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

12. ఆ నెయ్యిలో జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి అది తాళింపు లాగా కూరలో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ పాలకూర కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయినట్టే.

13. వేడి వేడి అన్నంలో ఈ కూరను తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువే. వారానికి రెండు మూడు సార్లు ఈ కూర వండుకొని తింటే పోషకాహార లోపమే రాదు.

పాలకూరను తరచూ తినమని పోషకాహార నిపుణులు చెబుతారు. ఎందుకంటే దీనికి రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంది. దీనివల్ల రక్తం పరిశుభ్రంగా ఉంటుంది. పాలకూరలో మన శరీరానికి అవసరమైన పోలిక్ యాసిడ్స్, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఖనిజాలు ఎన్నో ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా మహిళలు పాలకూరను కచ్చితంగా తినాలి. రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకోవడంలో పాలకూర ముందుంటుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఇది అడ్డుకుంటుంది. కోడిగుడ్డు గురించి ఎన్ని ఎంత చెప్పినా తక్కువ కోడిగుడ్డులో మనకు అవసరమైన ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక కోడి గుడ్డు తినడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024