TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త – భారీగా తగ్గిన బస్ పాస్ ధర, వివరాలివే

Best Web Hosting Provider In India 2024

TGSRTC Latest News : హైదరాబాద్‌ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించింది. ప్రయాణించే వారి సౌకర్యార్థం నెలవారీ బస్‌ పాస్‌ ధరను తగ్గిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కేవలం రూ.1900 కే ఈ బస్‌ పాస్‌ను సంస్థ అందజేస్తున్నట్లు తెలిపింది.

గతంలో ఈ బస్‌ పాస్‌ ధర రూ.2530 ఉండగా.. ప్రయాణికుల కోసం రూ.630 తగ్గించింది. ఈ బస్సు పాస్‌తో సికింద్రాబాద్ – పటాన్‌ చెరువు (219 రూట్), బాచుపల్లి – వేవ్ రాక్(195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంతేకాదు… ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించడం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో నడిచే పుష్ఫక్‌ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదు.

మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లను సంస్థ జారీ చేస్తున్నట్లు వెల్లడించింది..

IPL_Entry_Point

టాపిక్

TsrtcTravelTelangana NewsHyderabad
Source / Credits

Best Web Hosting Provider In India 2024