Best Web Hosting Provider In India 2024

TS DEECET Notification 2024 Updates: తెలంగాణలో ఒక్కో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా డీఈఈసెట్ 2024 ప్రకటన విడుదలైంది. జూలై 10వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్ కాలేజీతోపాటు, ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ముఖ్య వివరాలకు http://deecet.cdse.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ముఖ్య వివరాలు:
- ప్రవేశ పరీక్ష – తెలంగాణ డీఈఈసెట్ 2024
- 2024 -26 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు.
- దరఖాస్తులు – ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభం- జాన్ 08, 2024.
- దరఖాస్తులకు తుది గడువు – జూన్ 30, 2023
- పరీక్ష తేదీ – జూలై 10, 2024.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు.
- అధికారిక వెబ్ సైట్ – http : //deecet.cdse.telangana.gov. in
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు….
TS DOST 2024 Phase 1 seat allotment : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దోస్త్ ఆన్ లైన్ ప్రక్రియలో భాగంగా…. ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. విద్యార్థుల ఇచ్చిన వెబ్ ఆప్షన్ ఆధారంగా…. మొదటి దశలో మొత్తం 76,290 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి.
సీట్లు దక్కించుకున్న విద్యార్థులు జూన్ 7ను కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 12వ తేదీ వరకు అవకాశం ఉంది. మరోవైపు రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. జూన్ 13 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ల తర్వాత జూన్ 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 18న తేదీన దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూన్ 19 నుంచి 25 వరకు కొనసాగుతాయి.
TS DOST 2024 Phase 1 seat allotment result: ఇలా చెక్ చేసుకోండి
ఫస్ట్ ఫేజ్ లో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు దోస్త్ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి….
విద్యార్థులు ముందుగా https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
TS DOST 2024 Phase 1 seat allotment result లింక్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది.
ఏ కాలేజీ కేటాయించారో ఇక్కడ చూసుకోవచ్చు.
సీటు అలాట్ మెంట్ కాపీని కూడా పొందవచ్చు.
చివరి విడత జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్ 25 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 29వ తేదీన తుది విడుత సీట్లను కేటాయిస్తారు. జూలై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 7వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు తరగతులు ప్రారంభమవుతాయి.
టాపిక్