Best Web Hosting Provider In India 2024
Mutton Pulusu: మటన్ ఇగురుని ఎక్కువ మంది వండుకుంటారు. ఒకసారి మటన్ తో పులుసు పెట్టుకొని చూడండి. రుచి అదిరిపోతుంది. రాగిసంకటిలోకి, అన్నంలోకి, చపాతీలోకి… దేనితో తిన్నా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఒక పూట వండుకుంటే రెండు పూటలకు వస్తుంది. మటన్ పులుసును వండుకున్నప్పుడు రసం, సాంబార్ వంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని చేయడం చాలా సులువు. దీని రెసిపీ ఎలాగో ఇచ్చాము. ఫాలో అయిపోండి.
మటన్ పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ – అరకిలో
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – రెండు
నూనె – నాలుగు స్పూన్లు
టమోటాలు – రెండు
కారం – ఒక స్పూను
పసుపు – పావు స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
దాల్చిన చెక్క – ఒకటి
లవంగాలు – ఐదు
ధనియాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ఎండుకొబ్బరి తురుము – ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది
గసగసాలు – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
నీళ్లు – తగినన్ని
మటన్ పులుసు రెసిపీ
1. మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. ఉప్పు, పసుపు, కారం అల్లం వెల్లుల్లి పేస్టు, నీళ్లు వేసి మూత పెట్టాలి.
2. నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, ఎండు కొబ్బరి తురుము, గసగసాలు వేసి వేయించాలి.
4. వాటిని మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
5. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఆ నూనె వేడెక్కాక ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
6. అవి రంగు మారే వరకు వేయించుకోవాలి.
7. టమోటా తరుగును వేసి వేయించుకోవాలి. అవి మెత్తగా అయ్యేవరకు మూత పెట్టి ఉడికించాలి.
8. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి.
9. ఇప్పుడు కుక్కర్ మూత తీసి అందులో ఉన్న మటన్‌ను నీటితో సహా వేసి బాగా కలుపుకోవాలి.
10. కళాయిపై మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
11. తర్వాత మూత తీసి ముందుగా చేసుకున్న పొడిని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. పది నిమిషాలు పాటు అలా ఉడికించాలి.
12. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ మటన్ పులుసు రెడీ అయిపోతుంది.
13. దీన్ని ఇడ్లీ, దోశతో కూడా తినొచ్చు. చూస్తేనే నోరూరు పోతుంది. ఒక్కసారి చేసుకుని చూడండి. మటన్ ఇగురుకు బదులు మటన్ పులుసును చేసుకొని తింటారు.
మటన్ ఇగురుకు బదులు మటన్ పులుసు చేయడం వల్ల ఇది ఎక్కువ అన్నంలో కలుస్తుంది. ఒక పూట వండుకుంటే రెండు పూటలకు సరిపోతుంది. అంతేకాదు మటన్ పులుసులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ కూడా సవ్యంగా జరుగుతుంది. స్పైసీగా దీన్ని వండుకుంటే రుచి అదిరిపోతుంది. ఒకసారి మటన్ పులుసు రెసిపీని ప్రయత్నించండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. మటన్ ను ముందుగానే కుక్కర్లో బాగా ఉడికించుకున్నాకే ఈ పులుసును చేసుకోవాలి. ఎందుకంటే పులుసులో మటన్ ఉడకడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ముందుగానే 90 శాతం మటన్ ముక్కలను ఉడికించుకున్నకే మటన్ పులుసులో వేసుకోవాలి.
టాపిక్