Best Web Hosting Provider In India 2024
Tension at Kodali Nani House : కృష్ణా జిల్లా గుడివాడలోని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని…. మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు.
కొడాలి నాని ఇంటి వద్దకు చేరిన తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా తమ వెంట తెచ్చుకున్న కోడి గుడ్లను నాని ఇంటిపైకి విసిరారు. జై చంద్రబాబు అంటూ కోడాలి నాని ఇంటి వద్ద టపాసులను కూడా కాల్చారు. ఓ దశలో నాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మాట నిలబెట్టుకోవాలి – పొట్లూరి దర్శిత్
ఈ సందర్భంగా తెలుగు యువత నాయకుడు పొట్లూరి దర్శిత్ మాట్లాడుతూ… గుడివాడలో కొడాలి నానికు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని హెచ్చరించారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని కొడాలి నాని ఛాలెంజ్ చేశారని గుర్తు చేశారు. చెప్పిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
టాపిక్