Best Web Hosting Provider In India 2024
AP New CS Neerabh Kumar: ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, ఇతర సంస్థలకు సంబంధించి నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలను తెప్పించుకోవాలని ఆదేశించారు. వాటిని వెంటనే ఆమోదించాలని అన్ని శాఖల సెక్రటరీలకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను ఇచ్చారు.
ముగ్గురు ఐఎస్ఎస్ ల బదిలీ….!
మరోవైపు ఏపీలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరంతా కూడా ముఖ్యమంత్రి పేషీలో పని చేస్తున్నారు. వీరిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా ఉన్నారు. వీరిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాల్లో తెలిపారు.
టాపిక్
Andhra Pradesh NewsGovernment Of Andhra Pradesh