Rush OTT Release Date: ఈటీవీ విన్ ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా? రిలీజ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024


Rush OTT Release Date: తెలుగులో ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన ఈటీవీ విన్ తెరకెక్కించిన రష్ మూవీ ట్రైలర్ రిలీజైంది. అమ్మలతో పెట్టుకోకండి అంటూ సాగిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. తాను ఉద్యోగం చేస్తూనే భర్త, పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే ఓ సాధారణ మహిళ.. తన వాళ్లు ఆపదలో ఉంటే అపర కాళీగా ఎలా మారిందన్నదే ఈ సినిమా స్టోరీ.

రష్ ఓటీటీ రిలీజ్ డేట్

రష్ మూవీ ఈటీవీ విన్ ఒరిజినల్ గా వస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు కథ అందించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇక సతీష్ పోలోజు మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈటీవీ విన్ వెల్లడించింది. నాన్ స్టార్ అడ్రినలిన్ రష్ పేరుతో ఈ సినిమా వస్తోంది.

ఇక ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఓ భార్య, భర్త, ఇద్దరు పిల్లలు.. హాయిగా సాగిపోయే సంసారం. ప్రతి రోజులాగే ఆ రోజు ఉదయం కూడా వాళ్ల జీవితాలు మామూలుగానే ప్రారంభమైనా.. తర్వాత జరిగిన ఓ ఘటనతో మొత్తం మారిపోతోంది. సుఖ సంతోషాలతో సాగిపోతున్న వాళ్ల జీవితం తలకిందులవుతుంది. తన భర్త ఘోర కారు ప్రమాదానికి గురవుతాడు.

తమ పాపను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి వరకూ ఓ సాధారణ గృహిణి, తన పనేదో తాను చేసుకునే మహిళగా కనిపించిన ఆ భార్య అపర కాళీగా మారుతుంది. తన భర్త, పిల్లలను రక్షించుకోవడానికి దుష్టశక్తులతో పోరాడుతుంది. అక్కడి నుంచి రస్ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్సే కనిపిస్తాయి. సినిమా కోసం చేసిన స్టంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఊపిరి బిగపట్టి చూసేలా ఉండటం విశేషం. అయితే కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా కనిపిస్తున్నాయి. చివర్లో అమ్మలతో పెట్టుకోవద్దు అనే సందేశంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. మొత్తానికి ట్రైలర్ తోనే రష్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా మేకర్స్ కట్ చేశారు. జూన్ 13 నుంచి ఈ సినిమాను ఈటీవీ విన్ లో చూడొచ్చు.

ఈటీవీ విన్ లేటెస్ట్ రిలీజెస్

కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే ఉన్న ఓటీటీల్లో ఒకటి ఈటీవీ విన్. రామోజీ సంస్థల్లో ఒకటైన ఈటీవీ నుంచే ఈ ఈటీవీ విన్ ఓటీటీ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తోంది. కీచురాళ్లు, ఆరంభం, రామన్న యూత్, కల్కిలాంటి సినిమాలు ఈటీవీ విన్ ఓటీటీలో గత కొన్ని రోజుల్లో రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నాయి.

సినిమాలే కాకుండా #90’s పేరుతో ఈటీవీ విన్ తీసుకొచ్చిన వెబ్ సిరీస్ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే షోలు, సీరియల్స్ అన్నీ కూడా ఈ ఓటీటీలో చూడొచ్చు. మూడు నెలలకు కనీసం రూ.99 నుంచి ఏడాదికి గరిష్టంగా రూ.499 తో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024