Best Web Hosting Provider In India 2024
Damodaram Sanjivayya National Law University Jobs 2024 : విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరింది. దరఖాస్తులకు జూలై 1వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. www.dsnlu.ac వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోని ఆఫ్ లైన్ సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన – దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ, విశాఖ.
- ఉద్యోగాలు – నాన్ టీచింగ్, టీచింగ్
- ఖాళీల వివరాలు – ప్రొఫెసర్లు, అసిసోయేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోసియేట్స్, రిసెర్చ్ అసిస్టెంట్స్, అకౌంట్ ఆఫీసర్, పర్సనల్ సెక్రెటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్
- అర్హతలు – డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
- దరఖాస్తు ఫారమ్ – రూ. 2 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1000గా నిర్ణయించారు.
- దరఖాస్తు ఫారమ్ ను https://dsnlu.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ‘Registrar, Damodaram Sanjivayya National Law University, “NYAYAPRASTHA”, Sabbavaram, Visakhapatnam 531 035 (A.P) అడ్రస్ కు పంపాలి.
- అధికారిక వెబ్ సైట్ – https://dsnlu.ac.in/notifications/
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్
Ap JobsAndhra Pradesh NewsRecruitmentVisakhapatnam