వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం

Best Web Hosting Provider In India 2024

మాజీ మంత్రులు  కొడాలి నాని, పేర్ని నాని

దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి అండగా నిలుస్తాం..

పోలీసులపై హైకోర్టులో కేసులు వేస్తాం.. 

కృష్ణా జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నార‌ని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మండిప‌డ్డారు. టీడీపీ దాడుల నుంచి వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకుంటామ‌ని వారు ధైర్యం చెప్పారు. టీడీపీ దాడుల‌పై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేద‌న్నారు. కళ్లేదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై వారు మండిప‌డ్డారు. శ‌నివారం మ‌చిలీప‌ట్నంలో  కొడాలి నాని, పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీ మరో బిహార్‌గా మారుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు మా పై దాడులకు పాల్పడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేద‌ని కొడాలి  నాని ధ్వజమెత్తారు.

వైయ‌స్ఆర్‌పై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తామ‌ని వారు పేర్కొన్నారు. దాడులు చేసిన వారితో పాటు. చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం. ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయని.. ఈ దాడులకు పోలీసులు దగ్గర ఉండి చేయిస్తున్నారని విమర్శించారు. దాడులు జరుగుతుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. టీడీపీ అల్లరి మూకల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టులో కేసులు వేస్తామని వారు పేర్కొన్నారు.

  

Best Web Hosting Provider In India 2024