Angry Intercourse : కోపంలో శృంగారం చేస్తే జరిగే పరిణామాలు ఏంటి? మీరు ట్రై చేశారా?

Best Web Hosting Provider In India 2024

కోపంతో కూడిన శృంగారం అనే పద్ధతి కొన్ని జంటలు పాటిస్తూ ఉంటాయి. విపరీతమైన కోపం వచ్చినప్పుడు వారు ఇలాంటి పద్ధతులు పాటిస్తారు. లేదంటే జంటలో ఒకరైనా బలవంతంగా ఇలా చేస్తారు. కోపంతో శృంగారం నొప్పి, థ్రిల్లింగ్, ఉద్రిక్తతలను కలిగిస్తుంది. కొంతమంది వ్యక్తులు తమ భాగస్వాములతో చిరాకు, తమకు ఉన్న టెన్షన్‌ను పోగొట్టుకోవడానికి ఈ పద్ధది వాడుతారు.

కొన్నిసార్లు కోపంతో కూడిన శృంగారం పని ఒత్తిడి లేదా ప్రతికూల భావాల నుండి తప్పించుకోవడానికి ఒక మార్గంగా కూడా కొందరు ఉపయోగిస్తారు. ఇది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనది కాదు. కోపం శృంగారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ కథనంలో మీరు కోపం, శృంగారం మధ్య కనెక్షన్ గురించి తెలుసుకోండి..

మహిళల్లో లైంగిక కోరికలు తగ్గిస్తుంది

కోపం సాధారణంగా విభేదాలు, వాదనలు లేదా నిరాశ నుండి పుడుతుంది. అటువంటి పరిస్థితిలో కరుణ లేదా ప్రేమ భావన ఉండదు. ఇది ఆందోళన, ద్వేషం లేదా కోపం రూపంలో ఉంటుంది. ఈ భావోద్వేగాలు సహజమైనప్పటికీ అవి ఒక వ్యక్తి దృష్టి మరల్చగలవు. శృంగారం పట్ల తక్కువ ఆసక్తిని కలిగిస్తాయి. ఇది మహిళల్లో లిబిడో తగ్గడానికి కారణమవుతుంది. ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం కోపం, ఆందోళన మహిళల లైంగిక కోరికలను గణనీయంగా తగ్గిస్తాయి.

కోపాన్ని తగ్గిస్తుంది

కొందరు వ్యక్తులు కోపంగా ఉన్నప్పుడు వారి భాగస్వామితో కమ్యూనికేట్ చేయడానికి మార్గాలను వెతుకుతారు. మరికొందరు కోపం ఆధారిత లైంగిక కార్యకలాపాలలో పాల్గొంటారు. ఇది లైంగిక కార్యకలాపాల సమయంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేయడం ద్వారా కోపాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ కోపం అనేది శృంగార సమయంలో కొన్నిసార్లు దూకుడుగా మారవచ్చు. లైంగిక చర్య తర్వాత విభేదాలు పరిష్కారమైతే.. లేదా కోపం తగ్గినప్పుడు, ఇది జంట మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

కోపంలో శృంగారం అనేది జంటను చల్లబరుస్తుంది. వారి కోప స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ ఇది క్రమం తప్పకుండా జరిగితే, విషపూరిత సంబంధాలకు దారితీస్తే అది సంబంధానికి హానికరం. కొన్నిసార్లు కోపంతో కూడిన సెక్స్ జంటను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు దీనికి సిద్ధంగా ఉండకపోవచ్చు.

కోపంలో శృంగారం దుష్ప్రభావాలు

ఇది పల్స్, రక్తపోటుతో సహా శరీర శారీరక పారామితులను పెంచుతుంది. కొన్నిసార్లు తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఈ చర్య, బలవంతంగా ఉంటే సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు లైంగిక కార్యకలాపాలు సరిహద్దులను దాటవచ్చు. ఇది చాలా శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది. ఇది శృంగారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ప్రయోజనాలు

ఇది దంపతుల మధ్య బంధాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది గొడవలు ఎక్కువగా కాకుండా ఆపుతుంది. ఇది ప్రేమను ప్రోత్సహిస్తుంది. జంటలు బెడ్‌లో అనుభవించే శారీరక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. కోపంలో తారాస్థాయికి వెళ్లినవారు వెంటనే కూల్ అయ్యేందుకు ఈ తరహా శృంగారం ఉపయోగకరం.

రెగ్యులర్ శృంగారంలో ఫోర్ ప్లే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కోపంతో కూడినదాంట్లో ఫోర్ ప్లేకి ఆస్కారం తక్కువగా ఉంటుంది. లవ్ టాక్ ఉండదు. ఈ చర్య అకస్మాత్తుగా లేదా బలవంతంగా ప్రారంభమవుతుంది. కోపంతో కూడిన సెక్స్ ఆహ్లాదకరంగా ఉంటుంది. టెన్షన్‌ను విడుదల చేయడానికి సరైన మార్గం. కానీ ఇది కమ్యూనికేషన్ అడ్డంకులకు కూడా దారి తీస్తుంది. ఎంత మంచిగా అనిపించినా.., అంతర్లీన సమస్యను పరిష్కరించదని గుర్తుంచుకోండి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024