OTT Telugu Releases: ఈవారం తెలుగులో ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు ఇవే.. డబ్బింగ్‍లే..

Best Web Hosting Provider In India 2024


OTT Telugu Movie Releases: ఓటీటీలో కొత్తగా తెలుగు సినిమాలు చూడాలనుకునే వారికి ఈవారం కాస్త నిరాశ ఎదురైంది. ఈ వారం ఓటీటీల్లోకి కొత్తగా స్ట్రైట్ తెలుగు చిత్రాలు రాలేదు. అయితే, తెలుగు డబ్బింగ్‍లో మాత్రం నాలుగు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓ హిందీ సినిమా తెలుగు ఆడియోలోనూ అందుబాటులోకి వచ్చింది. ఓ మలయాళ మూవీ కూడా తెలుగులో స్ట్రీమ్ అవుతోంది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చిన నాలుగు సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

బ్లాక్‍ఔట్

బ్లాక్‍ఔట్ హిందీ మూవీఈవారం జూన్ 7వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుండా నేరుగా జియోసినిమాలోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చింది. తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ ఆడియోల్లోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. బ్లాక్ఔట్ చిత్రంలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే ప్రధాన పాత్ర పోషించారు. మౌనీ రాయ్, సునీల్ గ్రోవర్, జిషు సెంగుప్త, కరణ్ సుధాకర్ కూడా ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు. దేవాంగ్ శశిన్ భవ్సర్ దర్శకత్వం వహించారు. ఈ బ్లాక్ఔట్ చిత్రాన్ని జియోసినిమాలో చూసేయవచ్చు.

వర్షంగల్కు శేషం

వర్షంగల్కు శేషం మలయాళ సినిమా జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం తెలుగు ఆడియో డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది. అలాగే, తమిళం, హిందీ, కన్నడ వెర్షన్‍ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన వర్షంగల్కు శేషం చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాసన్, కల్యాణి ప్రియదర్షి, నివిన్ పౌలీ మెయిన్ రోల్స్ చేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి బ్లాక్‍బస్టర్ అయింది.

స్టార్

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘స్టార్’ సినిమా ఈవారం జూన్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. స్టార్ చిత్రంలో కెవిన్, లాల్, అదితి పోహాంకర్, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ న్యూఏజ్ కామెడీ డ్రామా చిత్రానికి ఇలాన్ దర్శకత్వం వహించారు. మే 10వ తేదీన థియేటర్లలో రిలీజైన స్టార్ చిత్రం మంచి కలెక్షన్లు దక్కించుకుంది. నెలలోగానే అమెజా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. స్టార్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

మిరల్

తమిళ నటుడు భరత్ హీరోగా నటించిన మిరల్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో జూన్ 7వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తమిళంలో గతేడాది నవంబర్ 11వ తేదీనే విడుదలైంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు. మిరల్ మూవీ తెలుగు డబ్బింగ్‍లో ఈ ఏడాది మేలోనూ రిలీజ్ అయింది. అయితే, తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మిరల్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ చిత్రంలో భరత్‍తో పాటు వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్ కీలకపాత్రలు చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024