OTT Movies: థియేటర్లలో రిలీజ్ – కానీ ఓటీటీలోకి మాత్రంరాలేదు – లాల్‌స‌లామ్‌తో ఈ పాటు ఈ లిస్ట్‌లో ఉన్న మూవీస్ ఏవంటే?

Best Web Hosting Provider In India 2024


OTT Movies: థియేట‌ర్ ఓటీటీకి గ్యాప్ రానురానూ త‌గ్గిపోతుంది. స్టార్ హీరోల సినిమాలు సైతం థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌లోపే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్నాయి. కానీ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన కొన్ని సినిమాలు మాత్రం థియేట‌ర్ల‌లో రిలీజై నెల‌లు కావ‌స్తోన్న ఓటీటీలోకి రావ‌డం లేదు. ఈ లిస్ట్‌లో స్టార్ హీరోలు న‌టించిన సినిమాలే కాకుండా థియేట‌ర్ల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాలు ఏవంటే?

ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్‌

ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్‌ థియేట‌ర్ల‌లో రిలీజై నాలుగు నెల‌లు దాటిపోయింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు. ర‌జ‌నీకాంత్ గెస్ట్ రోల్‌లో యాక్ష‌న్ స్పోర్ట్స్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టించారు. దాదాపు 90 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన లాల్ స‌లామ్ సినిమాకు ర‌జ‌నీకాంత్ కూతురుఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. భారీ అంచ‌నాల న‌డుమ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ రెండు చోట్ల డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

రెండు ఓటీటీల‌లో…

వారం రోజుల్లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండా పోయిన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలోకి రాలేదు. లాల్ స‌లామ్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు స‌న్ నెక్స్ట్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజై నాలుగు నెల‌లు కావ‌స్తోన్న ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లాల్‌స‌లామ్ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. లాల్ స‌లామ్ షూటింగ్ ఫుటేజీ మిస్స‌యింద‌ని, ఆ విష‌యంలో నిర్మాణ సంస్థ‌కు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు విభేదాలు వ‌చ్చాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ గొడ‌వ‌ల కార‌ణంగా లాల్ స‌లామ్ ఓటీటీలో రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని చెబుతోన్నారు.

ర‌జాకార్‌

తెలుగు మూవీ ర‌జాకార్ థియేట‌ర్ల‌లో మార్చి 15న విడుద‌లైంది.తెలంగాణ సాయుధ పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా ప‌ర్వాలేద‌నిపించింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ మాత్రం ఓటీటీలోకి రాలేదు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమాలో వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ, బాబీసింహా కీల‌క పాత్ర‌లు పోషించారు. యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

థియేట‌ర్ల‌లో హిట్టైనా…

అఖిల్ ఏజెంట్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ఏడాది దాటిపోయిన ఓటీటీ ఆడియెన్స్ ముందుకు మాత్రం రాలేదు. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే సోనీలివ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న‌ది. ఇప్ప‌టికి రెండు, మూడు సార్లు ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సోనీ లీవ్‌ అనౌన్స్ చేసిన లీగ‌ల్ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల వాయిదాప‌డింది.

రాజశేఖర్ శేఖర్…

న‌య‌న‌తార క‌నెక్ట్ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరిమెంట‌ల్ హార‌ర్ ఫిల్మ్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. థియేట‌ర్ల‌లో నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాక‌పోక‌వ‌డం మాత్రం ఇప్ప‌టికీ ఆడియెన్స్‌కు అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌గానే మిగిలింది. రాజ‌శేఖ‌ర్ శేఖ‌ర్ మూవీ కూడా థియేట‌ర్ల‌లో రిలీజై రెండేళ్ల‌యినా లీగ‌ల్ ఈష్యూస్ కార‌ణంగా ఓటీటీలో రిలీజ్ కాలేదు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024