Gangs of Godavari OTT: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే?

Best Web Hosting Provider In India 2024


Gangs of Godavari OTT: విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఆదివారం అఫీషియ‌ల్‌గా వెల్ల‌డైంది. ఈ యాక్ష‌న్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14న రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను పంచుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నేహా శెట్టి హీరోయిన్‌…

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి క‌థ ఇదే

ర‌త్నాక‌ర్ అలియాస్ లంకల ర‌త్న (విశ్వ‌క్‌సేన్‌) చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. దొంగ‌త‌నాలు చేస్తూ బ‌తికే ర‌త్న త‌న తెలివితేట‌లు, ధైర్యంతో ఎమ్మెల్యే దొర‌స్వామిరాజు గ్యాంగ్‌లో చేరుతాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల‌ దొర‌స్వామిరాజుకు (గోప‌రాజు ర‌మ‌ణ‌) వ్య‌తిరేకంగా ర‌త్న‌ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాడు. నానాజీ (నాజ‌ర్‌) స‌హాయంతో ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాత ర‌త్న జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? సాధార‌ణ దొంగ అత‌డు..టైగ‌ర్ ర‌త్న‌గా ఎలా మారాడు ?ర‌త్న ఏ నేరం చేసి జైలుకు వెళ్లాడు? లంక‌ల ర‌త్న‌ను ప్రేమించిన పెళ్లాడిన బుజ్జి (నేహాశెట్టి)అత‌డిని చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించింది? ర‌త్న‌కు వేశ్య ర‌త్న‌మాల‌తో (అంజ‌లి) ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

విశ్వ‌క్ సేన్ ఎన‌ర్జీ…

ర‌త్నం పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్‌, ఎన‌ర్జీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. విజువ‌ల్స్, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పాటు యువ‌ర్ శంక‌ర్ రాజీ బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. కానీ ఇలాంటి హీరోయిజం క‌థ‌ల‌తో తెలుగులో ఇదివ‌ర‌కు చాలా సినిమాలు రావ‌డంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి యావ‌రేజ్‌గా నిలిచింది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024