Best Web Hosting Provider In India 2024
Kalki 2898 AD Trailer: కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ రిలీజ్‍కు సమయం ఆసన్నమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ రేపు (జూన్ 10) విడుదల కానుంది. ఈ ఎపిక్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న రిలీజ్ కానుండగా.. మూడు వారాల ముందే ట్రైలర్ తీసుకొస్తోంది మూవీ టీమ్. ఈ తరుణంలో ట్రైలర్ తీసుకొచ్చే ముందు నేడు ఓ కొత్త పోస్టర్‌ను నేడు రివీల్ చేసింది.
దీపికా కొత్త లుక్
కల్కి 2898 ఏడీ నుంచి దీపికా పదుకొణ్ కొత్త లుక్‍ను మూవీ టీమ్ నేడు (మే 10) రివీల్ చేసింది. రేపు ట్రైలర్ రానుందంటూ ఈ పోస్టర్ తీసుకొచ్చింది. “నమ్మకం ఆమెతోనే మొదలవుతుంది” అంటూ రాసుకొచ్చింది. నమ్మకంతో ఎవరి కోసమో దీపికా ఎదురుచూస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.
‘ప్రతీ మారాల్సిందే” అంటూ పోస్టర్‌పై ఉంది. దీపికా వెనుక కొందరు పోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. తమపై ఆధిపత్యం చెలాయిస్తున్న వారిపై తిరగబడేందుకు దీపికా ఓ దళాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా.. తమకు సాయం చేసేందుకు ఎవరైనా వస్తారని నమ్మకంగా ఎదురుచూస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. రేపు (జూన్ 10) ట్రైలర్ రానుందంటూ ఉంది.
థియేటర్లలో ట్రైలర్
కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ రేపు (జూన్ 10) ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో రేపు ప్రదర్శితం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరాల్లో.. ఏ థియేటర్లలో కల్కి ట్రైలర్ ప్లే అవుతుందో లిస్టును నేడు వెల్లడించింది మూవీ టీమ్. ఆయా థియేటర్లలో రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ స్క్రీనింగ్ ఉంటుందని తెలిపింది.
కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవ పాత్ర చేశారు ప్రభాస్. విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి స్ఫూర్తిగా ఈ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో అశ్వత్థామగా నటించారు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్. ఇటీవలే ఈ పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్‌ను టీమ్ తీసుకొచ్చింది. లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. మరికొందరు స్టార్ నటుల క్యామియోలు కూడా ఉంటాయనే బజ్ ఉంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను భారీగా నిర్వహించాలని కల్కి 2898 ఏడీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. జూన్ 23వ తేదీన ఈ ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటోందట. ఆంధ్రప్రదేశ్‍లో ఈ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, ముంబైలో కూడా ఓ ఈవెంట్ చేయాలని ప్లానింగ్‍లో ఉన్నట్టు టాక్.
కల్కి 2898 ఏడీ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. గ్లోబల్ రేంజ్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్అశ్విన్ తీర్చిదిద్దారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జి కారు కూాడా హైలైట్‍గా కనిపిస్తోంది. ఇప్పటికే బుజ్జిభైరవ గ్లింప్స్ అదిరిపోగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో యానిమేషన్ సిరీస్ వచ్చింది. ఫ్యుచరస్టిక్ బుజ్జి కారును దేశంలోని కొన్ని ప్రధాన నగరాలకు తీసుకెళ్లి ప్రమోషన్లను చేస్తోంది మూవీ టీమ్.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits