Parenting Tips : మీ తల్లిదండ్రులలో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు వారికి ఇష్టమైన బిడ్డ అని అర్థం

Best Web Hosting Provider In India 2024

మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఇద్దరు పిల్లల్లో మీకు ఎవరు ఇష్టమని అడగండి, చాలా మంది తల్లిదండ్రులు సమాధానం ఇవ్వరు. అందరూ అంటే ఇష్టమనే చెబుతారు. ఇలా చెప్పడం సహజం ఎందుకంటే పిల్లల మధ్య వివక్ష ఉండకూడదు అని వారు అనుకుంటారు. ఒకరి పేరు చెబితే మరొకరు బాధపడతారని ఆలోచిస్తారు. కానీ తల్లిదండ్రుల మనస్సులో పిల్లలందరిలో ఒక బిడ్డకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

తల్లిదండ్రులు దాదాపు అన్ని విషయాల్లో ఆ బిడ్డను ప్రత్యేకంగా చూస్తారు. అమ్మానాన్న ఎక్కువగా విశ్వసించే, మాట్లాడటానికి, సలహాలు తీసుకోవడానికి, సరదాగా గడపడానికి ఇష్టపడే ఒక బిడ్డ ఎల్లప్పుడూ ఉంటుంది. తోబుట్టువుల అందరిలో ఒకరిపై తల్లిదండ్రులు ప్రేమను ఎక్కువగా చూపిస్తారు. మీ తల్లిదండ్రులలో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు వారికి ఇష్టమైన బిడ్డ అని అర్థం..

ఏ పిల్లవాడు తల్లిదండ్రుల కోపం నుండి తప్పించుకోలేడు. ముఖ్యంగా మీరు ఒక పెద్ద తప్పు చేసినప్పుడు, ఇష్టమైన వ్యక్తిగా ఉండటం వలన మీరు కొంత మాత్రమే శిక్షను అనుభవిస్తారు. మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించే పనులు చేయడం, తక్కువ గ్రేడ్‌లు రావడం, మీ సోదరుడు లేదా సోదరితో గొడవ వంటి వాటికి మీరు తరచుగా శిక్షించబడరు. మీరు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటే మీ అమ్మ లేదా నాన్న మిమ్మల్ని హెచ్చరికతో లేదా మంచి మాటలతో మందలిస్తారు.

తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డ అని తెలుసుకోవడానికి ఒక మార్గం ఏంటంటే మీ విజయాల గురించి ప్రతి ఒక్కరికీ చెప్పడానికి వారు గర్వపడుతున్నారో లేదో గమనించడం. మీరు ఇప్పటివరకు సాధించిన దాని గురించి మీ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ గర్వపడతారు. అయితే ఈ విషయాన్ని మాత్రం మీతో చెప్పుకోరు. బయట వారితో చెబుతూ సంతోషపడతారు.

తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడే బిడ్డను అనుమానించరు, విశ్వసిస్తారు. వారు ఇష్టమైన పిల్లల గురించి అంచనాలు వేయకుండా ఉంటారు. పిల్లల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

మీ పుట్టినరోజు వారి ల్యాప్‌టాప్ లేదా ఫోన్‌ పాస్ వర్డ్ ‌గా ఉంటే మీపై వారికి ఇష్టం ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి ఉంటే మీరు వారికి ఇష్టమైన బిడ్డ అని చెప్పడంలో సందేహం లేదు.

మీరు తల్లిదండ్రులకు సలహా ఇచ్చే రకం పిల్లలైతే, మీరు నిస్సందేహంగా వారికి ఇష్టమైన బిడ్డ. కుటుంబ సమస్యల నుంచి వ్యక్తిగత సమస్యల వరకు ప్రతిదానికీ మీ వద్ద సమాధానం ఉందని వారు భావిస్తారు.

మీ తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డ అయితే వారు మీతో మృదువుగా ఉంటారు. మరింత ప్రేమతో మాట్లాడతారు. దీనికి విరుద్ధంగా మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వారు ఎల్లప్పుడూ కఠినంగా ఉంటారు. మీకు తేడా తెలుస్తుంది.

పిల్లల అందరిపై తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. దాదాపు సమానంగానే చూస్తారు. అయితే ఒకరిపై మాత్రం ఇష్టం ఎక్కువగా చూపిస్తారు. చాలా మంది ఇళ్లలో ముగ్గురు పిల్లలు ఉంటే.. మెుదటి బిడ్డ లేదా చివరి బిడ్డపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024