Brahmamudi June 10th Episode: ఓడిపోయిన కావ్య – మాయ మెడ‌లో రాజ్ మూడుముళ్లు – నిజాలు బ‌య‌ట‌పెట్టిన సుభాష్‌

Best Web Hosting Provider In India 2024


Brahmamudi June 10th Episode: మాయ‌గా న‌టిస్తోన్న చిత్ర‌ను ఇంట్లో నుంచి పంపించేయ‌డానికి రాజ్ వేసిన ప్లాన్ బెడిసికొడుతుంది. త‌న దొంగ‌తెలివితేట‌ల‌తో రాజ్‌కు మాయ షాకిస్తుంది. మాయ‌తో త‌న పెళ్లిని ఎలా అడ్డుకోవాలో తెలియ‌క రాజ్ డీలాప‌డిపోతాడు. ఈ పెళ్లి ఆపేసే భారాన్ని కావ్య‌పై పెడ‌తాడు. త‌న‌ను ఓడిపోకుండా కాపాడ‌మ‌ని వేడుకుంటాడు. పెళ్లిని ఎలాగైనా ఆపుతాన‌ని రాజ్‌కు మాటిస్తుంది కావ్య‌.

 

సీతారామ‌య్య‌తో అప‌ర్ణ వాద‌న‌….

పెళ్లి ఏర్పాట్లు మొత్తం ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది అప‌ర్ణ‌. రాజ్‌, మాయ పెళ్లి చూడ‌టానికి ఇందిరాదేవి, సీతారామ‌య్య రావ‌డానికి ఒప్పుకోరు. తాము క‌న్యాదానం చేయ‌మ‌ని అప‌ర్ణ‌తో అంటారు. రాజ్ పెళ్లికి మేము వ‌స్తే ఎంత..రాక‌పోతే ఎంత అని అప‌ర్ణ‌తో అంటుంది ఇందిరాదేవి.

 

నేను త‌ప్పు చేస్తున్నాన‌ని మీరు అనుకుంటున్నారా అని సీతారామ‌య్య‌ను అడుగుతుంది అప‌ర్ణ‌. త‌ప్పొప్పుల గురించి నీకు చెప్పేంత వాళ్లం కాద‌ని సీతారామ‌య్య బ‌దులిస్తాడు. నేను మీ కోడ‌లిని…ఎన్న‌టికి త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకోన‌ని సీతారామ‌య్య‌, ఇందిరాదేవిల‌తో వాదిస్తుంది అప‌ర్ణ‌.

 

కొడుకు చేసిన త‌ప్పును స‌రిదిద్దేందుకే ఈ పెళ్లి జ‌రిపిస్తున్నాన‌ని అంటుంది. కావ్య జీవితాన్ని స‌రిదిద్ద‌గ‌ల‌వా అని అప‌ర్ణ‌ను అడుగుతాడు సీతారామ‌య్య‌. ఆమె స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉంటుంది.

 

అప‌ర్ణ బాధ‌…

రాజ్‌కు రెండో పెళ్లి చేయ‌డం నాకు ఇష్టం లేద‌ని, ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చినందుకు నా మ‌న‌సుకు క‌ష్టంగా ఉంద‌ని అప‌ర్ణ బాధ‌ప‌డుతుంది. పెళ్లి అనుమ‌తి ప‌త్రంపై కావ్య సంత‌కం పెట్టిన త‌ర్వాతే నా మ‌న‌సుకు ఉప‌శ‌మ‌నంగా ఉంద‌ని చెబుతుంది. ఏ భార్య…త‌న భ‌ర్త‌ను వ‌దులుకోలేదు.

 

కానీ మ‌న‌సు చంపుకొని కావ్య అనుప‌మ‌తి ప‌త్రంపై సంత‌కం పెట్టింది. అది ఆమె అమాయ‌క‌త్వం అనుకోవాలో…లేదా ఈ ఇంటి గౌర‌వం నిల‌బెట్ట‌డానికే ఈ ప‌నిచేసిందో మ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేసింద‌ని సీతారామ‌య్య అంటాడు. అప‌ర్ణ‌కు సీతారామ‌య్య క్లాస్ ఇవ్వ‌డం ఇందిరాదేవికి న‌చ్చ‌దు. రాజ్‌, మాయ‌ల పెళ్లికి తాము వ‌స్తామ‌ని అప‌ర్ణ‌ను అక్క‌డి నుంచి పంపేస్తుంది.

 

మాయ విజ‌య‌గ‌ర్వం…

మాయ‌కు డాక్ట‌ర్ స్పెష‌ల్ ఇంజెక్ష‌న్ ఇస్తుంది. ఆ ఇంజెక్ష‌న్ వ‌ల్ల ప‌ది నిమిషాల్లో మాయ స్పృహ‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అప్పుతో అంటుంది డాక్ట‌ర్‌. మ‌రోవైపు పెళ్లి పీట‌ల‌పై కూర్చున్న మాయ విజ‌య‌గ‌ర్వంతో కావ్య వైపు చూస్తుంది. ఈ పెళ్లిన ఎలా ఆపాలో తెలియ‌క కావ్య టెన్ష‌న్ ప‌డుతుంటుంది. ఈ పెళ్లి ఇష్టం లేన‌ట్లుగా సుభాష్‌, ప్ర‌కాశం ఉంటారు. ఎవ‌రికి ఇష్టం ఉన్న లేక‌పోయినా ఈ పెళ్లి ఆగ‌ద‌ని అప‌ర్ణ అంటుంది. ప‌సిబిడ్డ‌కు న్యాయం చేసేందుకు ఈ పెళ్లి జ‌రిపించి తీరుతాన‌ని అప‌ర్ణ చెబుతుంది.

 

స్వ‌ప్న ఫైర్‌…

నువ్వు కూడా అంక్షిత‌లు వేయ్ అంటూ కావ్య‌తో కోపంగా అంటుంది స్వ‌ప్న‌. రాజ్‌, మాయ‌ల‌కు హార‌తి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించ‌మ‌ని కావ్య‌కు క్లాస్ పీకుతుంది స్వ‌ప్న‌. చేత‌కానీ వాళ్లు అంద‌రూ అంక్షిత‌లు వేస్తున్నార‌ని అంద‌రిపై కోప్ప‌డుతుంది. తాను మాత్రం మాయ‌పై అంక్షింత‌లు వేయ‌న‌ని అంటుంది. మా కావ్య చెబితే పెద్ద బండ‌రాయి తీసుకొచ్చి మాయ నెత్తిన వేస్తాన‌ని అంటుంది.

 

అప‌ర్ణ అంగీకారం….

అప‌ర్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది మాయ‌. ఇక నుంచి మిమ్మ‌ల్ని నేను అత్త‌య్య అని పిల‌వొచ్చా అని అప‌ర్ణ‌ను అడుగుతుంది మాయ‌. అందుకు అప‌ర్ణ ఒప్పుకుంటుంది. ఆ సీన్ చూసి కావ్య షాక‌వుతుంది. దుఃఖాన్ని ఆపుకోలేక కావ్య అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. బోరున విల‌పిస్తుంది. ఆమెను ఇందిరాదేవి ఓదార్చుతుంది. మొద‌టిసారి ఓడిపోతాన‌ని భ‌యంగా ఉంద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, ఆ దేవుడు నా భ‌ర్త‌ను నాకు ఎందుకు కాకుండా చేస్తున్నాడ‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది.

 

ఏ దారి లేదు…

ఈ పెళ్లి ఆప‌డానికి ఏదైనా అవ‌కాశం ఉందా కావ్య‌ను అడుగుతుంది ఇందిరాదేవి. ఏ దారి లేద‌ని కావ్య స‌మాధాన‌మిస్తుంది. అయితే ఈ పెళ్లి నాకు ఇష్టం లేద‌ని అప‌ర్ణ‌తో చెప్ప‌మ‌ని కావ్య‌తో అంటుంది ఇందిరాదేవి. కాగితం మీద రాసి ఇచ్చాను క‌దా. మాట త‌ప్పి ఎదురుతిరిగితే త‌న‌కు వ్య‌క్తిత్వం లేకుండాపోతుంద‌ని కావ్య అంటుంది. మాట త‌ప్ప‌న‌ని చెబుతుంది.

 

సుభాష్ కంగారు…

రాజ్ పెళ్లి ….పీట‌ల వ‌ర‌కు రావ‌డం చూసి సుభాష్ కూడా కంగారు ప‌డ‌తాడు. ఎలా ఈ పెళ్లి ఆపుతావ‌ని కావ్య‌ను అడుగుతాడు. పెళ్లి కొడుకు గెట‌ప్‌లో రాజ్ కింద‌కు దిగుతాడు. నిన్ను న‌మ్మి పీట‌ల మీద కుర్చుంటున్నాను. ఇక భారం అంతా నీదే అని కావ్య‌తో అంటాడు రాజ్‌. పెళ్లిని ఆప‌డానికి ఏం చేయ‌లేవా అని క‌ళ్యాణ్ కూడా కావ్య‌ను అడుగుతాడు. మాయ‌ను చంపైనా ఈ పెళ్లి ఆపుతాన‌ని స్వ‌ప్న అంటుంది. అవ‌స‌ర‌మైతే జైలుకు వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌ని అంటుంది. ఈ పెళ్లి ఆప‌డానికి ఏం చేయాలో చెప్ప‌మ‌ని ఇందిరాదేవి కూడా కావ్య‌తో అంటుంది.

 

రాహుల్ డౌట్‌…

అప్పుడే అప్పు ఫోన్ చేసి మాయ స్పృహ‌లోకి వ‌చ్చింద‌ని కావ్య‌తో చెబుతుంది. ఆ మాట విన‌గానే సంతోషంగా కావ్య హాస్సిట‌ల్‌కు బ‌య‌లుదేరుతుంది. పెళ్లి జ‌ర‌గ‌బోతుండ‌గా కావ్య బ‌య‌ట‌కు వెళ్ల‌డం చూసి రాహుల్ డౌట్ ప‌డ‌తాడు. ఈ పెళ్లిని ఆ దేవుడు కూడా ఆప‌లేడ‌ని రుద్రాణి అంటుంది.

 

మాయ‌పై సెటైర్స్‌…

నువ్వు ఏం చేసినా చివ‌ర‌కు నేను గెలిచాన‌ని, కాసేప‌ట్లో నిన్ను నా సొంతం చేసుకుంటాన‌ని రాజ్‌తో అంటుంది చిత్ర‌. తాళి క‌ట్టే లోపు ఏదైనా జ‌ర‌గొచ్చు అని చిత్ర‌కు స‌మాధాన‌మిస్తాడు రాజ్‌. పంతులు కూడా చిత్ర‌పై సెటైర్స్‌వేస్తాడు.

 

కోమాలోకి వెళ్లిన మాయ‌…

టెన్ష‌న్‌తో హాస్సిట‌ల్‌కు వ‌చ్చిన కావ్య‌…నువ్వు చెప్పే స‌మాధానంపైనే నా జీవితం ఆధార‌ప‌డి ఉంద‌ని అస‌లు మాయ‌ను క‌న్నీళ్ల‌తో వేడుకుంటుంది. ఆ బిడ్డ‌కు…మా మావ‌య్య‌కు…నీకు ఏమైనా సంబంధం ఉందా. నువ్వు స‌మాధానం చెప్ప‌క‌పోతే ఓ కుటుంబ‌మే రోడ్డున ప‌డుతుంద‌ని కావ్య క‌న్నీళ్ల‌తో మాయ‌ను అడుగుతుంది.

 

మాయ స‌మాధానం చెప్ప‌బోతూ స్పృహ కోల్పోతుంది. దాంతో కావ్య టెన్ష‌న్ మ‌రింత పెరిగిపోతుంది. మాయ‌ను ప‌రీక్షించిన డాక్ట‌ర్స్ ఆమె కోమాలోకి వెళ్లిపోయింద‌ని అంటుంది. దాంతో క‌న్నీళ్ల‌తో ఇంటికొచ్చిన కావ్య ఈ పెళ్లి ఆప‌లేన‌ని చేతులెత్తి మొక్కుతుంది. మాయ మెడ‌లో మూడుముళ్లు వేయ‌మ‌ని రాజ్‌తో అంటాడు పంతులు. అత‌డు తాళిక‌ట్ట‌బోతుండ‌గా సుభాష్ ఆప‌మ‌ని గ‌ట్టిగా అరుస్తాడు.

 

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024