టీడీపీ అరాచ‌క కాండ‌పై పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధం

Best Web Hosting Provider In India 2024

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండపై పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధం అవుతోంది. దాడులకు కౌంటర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించుకుంది. అదే సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే.. వారి రక్షణ కోసం కార్యాచరణ అనుసరించాలని నిర్ణయించింది.  
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని జిల్లా ఎస్పీల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేయిస్తారు. ఆపై కోర్టులో కూడా దావాలు వేయిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రొసీజర్లను లీగల్‌ టీం చూసుకునేలా వైయ‌స్ఆర్‌సీపీ ప్రణాళిక రూపొందించింది. 

ఇదిలా ఉంటే..  ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని, సాధారణ ఓటర్లను, ఆఖరికి.. వైయ‌స్ఆర్‌సీపీ జెండా మోసిన వాళ్లను సైతం వదలడం లేదు. ఈ దాడుల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. 

మరోవైపు దాడులపై కేసులు సైతం నమోదు చేయకుండా.. పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా దెబ్బ తినడం

Best Web Hosting Provider In India 2024