Pokkiri Re Release: పోక్కిరి రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌- మ‌హేష్ బాబు రీమేక్‌తో రికార్డుల‌పై క‌న్నేసిన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్‌

Best Web Hosting Provider In India 2024


Pokkiri Re Release: ద‌ళ‌ప‌తి విజ‌య్ గిల్లి మూవీ రీ రిలీజ్‌లో రికార్డ్ నెల‌కొల్సింది. 30 కోట్ల‌కుపైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను పండించింది. రీ రిలీజ్ సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా గిల్లి రికార్డ్ నెల‌కొల్సింది. అంతే కాకుండా ఏప్రిల్ 20న థియేట‌ర్ల‌లో రీ రిలీజైన ఈ మూవీ యాభై రోజులు దాటినా చెన్నైలోని ప‌లు థియేట‌ర్ల‌లో ఆడుతోంది. రీ రిలీజ్‌లోనూ యాభై రోజులు పూర్తిచేసుకున్న ఫ‌స్ట్ మూవీగా ద‌ళ‌ప‌తి విజ‌య్ గిల్లి నిలిచింది.

పోక్కిరి రీ రిలీజ్‌….

గిల్లి స‌క్సెస్‌తో ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. పోక్కిరి మూవీ జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పోక్కిరి మూవీకి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2007లో రిలీజైన ఈ మూవీ విజ‌య్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది.

థియేట‌ర్ల‌లో రెండు వంద‌ల రోజుల‌కుపైగా ఆడ‌ట‌మే కాకుండా 75 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సాధించింది. నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్స్‌ను మిగిల్చింది. పోక్కిరి సినిమాలో విజ‌య్‌కి జోడీగా ఆసిన్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించాడు. పొక్కిరిలో విజ‌య్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్‌తో పాటు మ్యూజిక్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

గిల్లి రికార్డ్ బ్రేక్‌…

దాదాపు ప‌దిహేడేళ్ల త‌ర్వాత పోక్కిరి మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రాబోతుండ‌టంతో అభిమానుల్లో ఫుల్‌జోష్ నెల‌కొంది. గిల్లి రికార్డును పొక్కిరి బ్రేక్ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే పోక్కిరి అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్ చేయ‌బోతున్నారు. త‌మిళ‌నాడులో దాదాపు రెండు వంద‌ల నుంచి మూడు వంద‌ల‌కుపైగా థియేట‌ర్ల‌లో పోక్కిరి మూవీ రీ రిలీజ్ కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు.

మ‌హేష్ రీమేక్‌లే…

గిల్లితో పాటు పోక్కిరి రెండు సినిమాలు మ‌హేష్‌బాబు రీమేక్‌లే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌హేష్‌బాబు హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పోకిరి మూవీ రీమేక్‌గా పోక్కిరి తెర‌కెక్కింది. గిల్లి మూవీ ఒక్క‌డు ఆధారంగా రూపొందింది. మ‌హేష్‌బాబు సినిమాల కంటే ద‌ళ‌ప‌తి విజ‌య్ రీమేక్ సినిమాలే ఎక్కువ‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అంతే కాదు పోకిరిని హిందీలోనూ రీమేక్ చేశాడు ప్ర‌భుదేవా. హిందీ రీమేక్‌లో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించాడు. అక్క‌డ కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

లియోతో బ్లాక్‌బ‌స్ట‌ర్‌…

గతేడాది లియో చిత్రంతో బ్లాక్‍బాస్టర్ అందుకున్నాడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 600 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్రస్తుతం విజయ్.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‍టైమ్’ చిత్రం చేస్తున్నారు. మానాడు ఫేమ్ వెంకట్ ప్ర‌భు దర్శకత్వంలో ఫాంట‌సీ యాక్షన్ మూవీగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

ది గోట్ త‌ర్వాత విజ‌య్ మ‌రో మూవీ చేసి యాక్టింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే తమిళగ వెట్రి కజగమ్ పార్టీని స్థాపించాడు విజ‌య్‌. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న విజ‌య్ నెక్స్ట్ ఎలెక్ష‌న్స్‌లో పోటీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్ లాస్ట్ మూవీకి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024