Best Web Hosting Provider In India 2024
Eatala Rajender: భారతీయ జనతా పార్టీ అధిష్టానం తన రాజకీయ భవిష్యత్తును, తన పాత్ర, బాధ్యతను నిర్ణయిస్తుందని మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ చెప్పారు.
ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని నరేంద్ర మోడీ, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వేడుకలు ఘనంగా జరిగాయని, భారతదేశం వివిధ రాష్ట్రాలు, సంస్కృతులు, కులాలు, మతాలతో సహా అపారమైన వైవిధ్యం కలిగిన పెద్ద దేశమని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చే ఐదేళ్లు దేశానికి విజయాన్ని అందిస్తాయన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో మంత్రి పదవిని ఆశించిన వారిలో ఈటల కూడా ఉన్నారు.
తెలంగాణ బిజెపి నుండి ఇద్దరికి కేంద్ర మంత్రులుగా చేర్చుకున్నారు, గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి ఒక్కరికే కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కింది. తెలంగాణలో బీజేపీ ఎంపీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎనిమిది మంది ఎంపీలుగా గెలుపొందారు. గంగాపురం కిషన్ రెడ్డి తిరిగి క్యాబినెట్ మంత్రిగా నామినేట్ అయ్యారు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ సహాయ మంత్రిగా అవకాశ దక్కింది.
మోడీ 3.0 క్యాబినెట్ లో భాగం కాకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఈటల రాజేందర్ సమాధానమిస్తూ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన డిమాండ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సభ్యుడికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది.
ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న జి.కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత ఈటల మాట్లాడుతూ, “మళ్లీ మంత్రివర్గంలో భాగం అయినందుకు కిషన్ రెడ్డిని అభినందించినట్టు చెప్పారు. కిషన్ రెడ్డి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారని, 2024లో కూడా తన వంతు సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.
తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఊహాగానాలపై ఈటల రాజేందర్ స్పందించిన ఈటల తన పాత్రను తాను నిర్ణయించలేననన్నారు. వేర్వేరు సభ్యులకు వేర్వేరు బాధ్యతలు అప్పగించడం మా పార్టీ బాధ్యత అని తనకు ఏ బాధ్యతలు అప్పగించాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
30 మంది క్యాబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, బీజేపీకి చెందిన ఐదుగురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ మిత్రపక్షాలతో కూడిన ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో తెలంగాణ బీజేపీ పగ్గాలను కొత్తవారికి అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
కేంద్ర మంత్రులుగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ జైరాం గడ్కరీ, జగత్ ప్రకాశ్ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, సుబ్రమణ్యం జైశంకర్, మనోహర్ లాల్, హెచ్డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్