AP Branded Liquor : ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్- బ్రాండెడ్ బీర్లు, లిక్కర్ వచ్చేస్తున్నాయ్!

Best Web Hosting Provider In India 2024


AP Branded Liquor : ఇన్నాళ్లూ నచ్చిన బ్రాండ్ కోసం పడిగాపులు గాసిన మందుబాబులకు మంచిరోజులు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో…మందు బ్రాండ్ లు మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే లిక్కర్ ధరలు తగ్గిస్తామని, నచ్చిన బ్రాండ్ లు తాగే విధంగా పాత బ్రాండులు అందుబాటులో ఉంచుతామని కూటమి పార్టీలు హామీలు ఇచ్చాయి. ఈ మేరకు బ్రాండెడ్ లిక్కర్ మళ్లీ అందుబాటులోకి వస్తుంది. టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణా రెడ్డి ట్వీట్ వైరల్ అవుతుంది. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ, కింగ్ ది షిషర్ చీర్స్’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గుడ్ న్యూస్ చెప్పారంటూ నెటిజన్లు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చినట్లు నాణ్యమైన మద్యం మళ్లీ అందుబాటులోకి రాబోతుందని తెలుస్తోంది.

బ్రాండెడ్ మందు కోసం ఎదురుచూపులు

గత వైసీపీ పాలనలో లిక్కర్ ధరలు ఆకాశాన్ని అంటాయి. మద్య నిషేధం హామీతో ప్రభుత్వం చేపట్టిన వైసీపీ…ధరలు పెంచి మద్యం తాగే వాళ్లను నిరూత్సాహపరిచి, మద్యనిషేదం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పింది. అయితే మద్యం నుంచి ఆదాయంతోనే సంక్షేమ పథకాలు నడిచాయని అందరికీ తెలిసిన విషయమై. వైసీపీ పాలనలో భారీగా మద్యం ధరలు పెరగడంతో మందుబాబు…అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఎన్నికల్లో చంద్రబాబు హామీలకు మొగ్గుచూపారో, ఏమో తెలియదు కానీ..కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం…ఏపీలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రాండెడ్ మద్యం, బీర్లు ఇప్పటికే మద్యం గోడౌన్లలోకి చేరుతున్నారు. స్టాక్ తెప్పించి పెడుతున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్ వంటి బీర్లతో పాటు ఎన్నడూ చూడని మద్యం బ్రాండ్లతో మందుబాబు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. నాసిరకం మందును ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చేదని ఆవేదన చెందేవారు. దీంతో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు సైతం అంగీకరించేవాళ్లు కాదు. ఆ సొమ్మంతా వైసీపీ నేతలకు వెళ్లేదని ఆరోపణలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గి, నచ్చిన బ్రాండ్ దొరుకుతుందని మందుబాబుబు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

కొత్త మద్యం పాలసీ!

అలాగే ఏపీ మద్యం పాలసీపై ఆసక్తికర చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో తెచ్చిన మద్యం పాలసీని రద్దు చేసి, కొత్త పాలసీని తీసుకొస్తారని తెలుస్తోంది. అదేవిధంగా డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేసి, కొత్త మద్యం పాలసీని అమలు చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలోని 3600 మద్యం షాపులను టెండర్ విధానంలో కేటాయింపులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో షాపునకు రూ.45 వేలు, పట్టణాల్లో రూ.55 వేలు డిపాజిట్ సొమ్ము నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించరు. నాసిరం మద్యం లేకుండా నాణ్యమైన పాత బ్రాండ్లను మందుబాబులకు అందించే విధంగా నూతన మద్యం పాలసీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన మద్యం కోసం పక్క రాష్ట్రాల వైపు చూసి పరిస్థితి మారుతుందని మందుబాబు ఖుషీగా ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsLiquorTrending ApTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024