Rainy Season Kashayam : వానాకాలంలో ఈ కషాయం తాగితే.. జలుబు, దగ్గు మాయం

Best Web Hosting Provider In India 2024

వర్షాకాలంలో సాధారణ సమస్య జలుబు, దగ్గు. ఈ సమస్య పిల్లలు, పెద్దలను ప్రభావితం చేస్తుంది. ఈ సాధారణ సమస్యకు సాధారణ చిట్కాలు ఉన్నాయి. మీరు మెడికల్ షాపులోకి వెళ్లి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ కషాయాన్ని పురతాన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చాలా ఈజీగా ఈ కషాయం తయారు చేసుకోవచ్చు. చేసేందుకు సమయం కూడా ఎక్కువగా అవసరం లేదు.

సాధారణ జలుబు-దగ్గుకు సమర్థవంతమైన ఇంటి నివారణగా ఈ కషాయం పని చేస్తుంది. దీనిని తయారుచేసేందుకు మీరు వంట గదిలోకి వెళ్తే సరిపోతుంది. కావాల్సిన పదార్థాలు అన్ని అక్కడే ఉంటాయి. జలుబు, దగ్గుకు కషాయం ఎలా చేయాలో చూద్దాం..

1/2 tsp పసుపు పొడి, 1/2 tsp అల్లం పొడి లేదా 1/2 అంగుళాల పచ్చి అల్లం, 1 tsp నిమ్మరసం, కొన్ని లవంగాల పొడి, సగం స్పూన్ దాల్చిన చెక్క పొడి.

నిమ్మరసాన్ని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పదార్థాలను 5 నిమిషాలు ఉడకబెట్టి, 1 చెంచా తేనె, 1 చెంచా నిమ్మరసం కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. దగ్గు, జలుబు తగ్గుతుంది.

పసుపు

ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్‌లతో పోరాడడంలో పసుపు చాలా సహాయపడుతుంది. ఇది దగ్గు-జలుబును తగ్గించడానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. పసుపు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అల్లం

దగ్గు-జలుబు సమస్యకు అల్లం దివ్యౌషధం. అల్లం అనేక గృహ నివారణలలో చేర్చారు. అల్లం వాడటం వల్ల గొంతులో నొప్పి, విపరీతమైన చికాకు కలిగించే దగ్గు తగ్గుతుంది. వర్షాకాలంలో క్రమం తప్పకుండా అల్లం వాడటం మంచిది.

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబును నివారించడంలో కూడా చాలా సహాయపడుతుంది.

దాల్చిన చెక్క పొడి

ఈ చెక్క పొడి గొంతు నొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. కానీ కొంతమందికి చెక్క వాసన నచ్చదు. అలాంటి వారు దీనిని తీసుకోవడం గురించి ఆలోచించాలి. ఈ చెక్కను ఉపయోగించడం ద్వారా ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది

తేనె

తేనె జలుబు, దగ్గుకు కూడా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఈ మిశ్రమానికి తేనెను కలపాలి. ఎందుకంటే ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు క్రిములతో పోరాడుతాయి.

ఈ కషాయం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఈ కషాయాన్ని తాగవచ్చు. చాలా ప్రయోజనాలను పొందుతారు. దగ్గు, జలుబుకు ఉత్తమమైన ఇంటి నివారణ. ఈ కషాయాన్ని చిన్న పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. చాలా చిన్న పిల్లలకు ఇవ్వవద్దు. ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తక్కువ మెుత్తంలో ఇవ్వాలి.

దుష్ప్రభావాలు ఉన్నాయా

కషాయం ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే, ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సాధారణ జలుబు-దగ్గు కోసం దీన్ని ప్రయత్నించండి. మీరు కచ్చితంగా ఫలితాన్ని చూస్తారు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024