Tuesday Motivation : గెలుపును గమ్యంగా చూడకు.. ప్రయాణం అనుకో.. మరో మైలురాయి దాటగలవు

Best Web Hosting Provider In India 2024

జీవితంలో విజయం సాధించాలంటే గతంతో పని లేదు, కేవలం వర్తమానం, భవిష్యత్ మీదనే ఆలోచిస్తూ మీ ప్రయాణం ఉండాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప కంపెనీలకు పెద్ద పొజిషన్‌లో పని చేస్తున్న భారతీయులు అలా వెళ్లినవారే. ఉదాహరణకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్. అతి సాధారణ పరిస్థితుల్లో పెరిగిన ఈ వ్యక్తులు ఎవరూ ఊహించని విధంగా ప్రపంచంలోనే పెద్ద కంపెనీలకు పని చేస్తున్నారు. అందుకే జీవితంలో దేనితో ఆగిపోకూడదు.

విజయం గమ్యం కాదు, ప్రయాణం మాత్రమే. అప్పుడే మరో మైలురాయి మీ ముందు కనిపిస్తుంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవిత పాఠాలను కలిగి ఉంటాడు. అది వారి జీవితాన్ని మార్చేస్తుంది. విజయం వైపు నడిపిస్తుంది. అవి వైఫల్యాలు, పరీక్షలు కావచ్చు. కానీ వారు తమ లక్ష్యాలను, కలలను చేరుకోవడానికి ప్రేరేపిస్తాయి. ప్రయత్నం ద్వారానే విజయం సాధ్యం.

అపజయం విజయానికి వ్యతిరేకం అంతే.. కానీ వైఫల్యం జీవితంలో విజయానికి సోపానంగా చెప్పుకోవాలి. విజయవంతమైన వ్యక్తులందరూ వైఫల్యాన్ని వారి జీవిత ప్రయాణంలో ఒక అనివార్యమైన అభ్యాసం, పైకి లేచేందుకు అవకాశంగా చూస్తారు.

విజయం రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. ఓర్పు, దృఢ సంకల్పం, బుద్ధి ఉంటే ఎన్ని పెద్ద అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగవచ్చు.

జీవితంలో విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కచ్చితమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. కష్టపడి సాధించగల లక్ష్యాలు అవి. ఏమి సాధించాలనే దానిపై స్పష్టమైన దృష్టి ఆ లక్ష్యం వైపు పుష్ చేయడానికి మీకు శక్తిని, ప్రేరణను ఇస్తుంది.

విజయానికి మార్గం కూడా ప్రమాదాలను కలిగి ఉంటుంది. అన్ని ప్రమాదాలు ఒకేలా ఉండవు. విజయవంతమైన వ్యక్తులు రిస్క్‌లను తీసుకుని అధ్యయనం చేసిన తర్వాత ముందుకు వెళ్తారు.

మన జీవితంలోని విజయాలు, వైఫల్యాలలో మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కీలక పాత్ర పోషిస్తారు. విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ సానుకూల, మద్దతు ఉన్న వ్యక్తులతో సమయాన్ని గడపాలని కోరుకుంటారు. ఎందుకంటే వారు వారిని ప్రోత్సహిస్తారు. వారి పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి వారిని ప్రేరేపిస్తారు.

ఈ బిజీ ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మారడం అనేది విజయానికి అత్యంత అవసరమైన లక్షణాలలో ఒకటి. విజయవంతమైన వ్యక్తులు మార్పుకు వెనుదిరగరు. పరిస్థితిని బట్టి విధానాలను మార్చుకుంటారు. ఆలోచనలతో మార్చేస్తారు. అప్పుడు అప్డేట్‌గా ఉంటారు.

ఈ రోజుల్లో శ్రమ సరిపోదు. తెలివిగా పని చేయండి. హార్డ్ వర్క్ మాత్రమే కాదు.. మీరు స్మార్ట్ వర్క్ కూడా నేర్చుకోవాలి. విజయ రహస్యం తెలిసిన వారు పనులకు ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తమ ఫలితాలను ఇచ్చే పనుల వైపు చూస్తారు.

ఎదురుదెబ్బలు, సవాళ్లను ఎదుర్కోకుండా విజయం రాదు. అయితే ఆ సమయాల్లో కూడా పరాజయాల నుంచి పుంజుకునే ధైర్యం, పట్టుదల ఉన్నవారే విజయపథంలో దూసుకెళ్తారు. అందుకే గమ్యాన్ని ప్రయాణంగా చూడు.. ఊహించని టార్గెట్ నీ సొంతం అవుతుంది. కష్టపడే తత్వం ఉంటే.. ఎంతటి విజయమైనా మీ కాళ్ల కిందకు వస్తుంది. మీకు ఉండాల్సిందల్లా వెళ్లే దారిపై అవగాహన.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024