NNS June 11th Episode: అమ్ము మాటలతో భాగీకి అనుమానం- ఘోరా దగ్గరికి అమ్ము- నిప్పంటించిన మనోహరి- కాలిపోయిన అరుంధతి బొమ్మ

Best Web Hosting Provider In India 2024


Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 11th June Episode) కిచెన్​లోకి వచ్చిన అమ్ము తనపై కోపంగా ఉండటంతో మిస్సమ్మ బాధపడుతుంది. వాళ్లంటే చిన్న పిల్లలు నువ్వైనా నన్ను అర్థం చేసుకో అమ్ము అంటుంది మిస్సమ్మ. మా అమ్మ తర్వాత మళ్లీ మేమంతా అంతగా ప్రేమించింది నిన్నే.. కానీ, నువ్వు మమ్మల్ని మోసం చేశావు మిస్సమ్మ అంటుంది అమ్ము.

 

నాకేం తెలీదు

ఆ ఒక్కరోజుని తీసేసి నన్ను అర్థం చేసుకో అమ్ము.. అసలు ఆరోజు ఏం జరిగిందో.. నేను పెళ్లిపీటల మీదకి ఎలా వచ్చానో.. మీ నాన్నతో ఈ తాళి ఎందుకు కట్టించుకున్నానో నాకేం తెలీదు.. ఎంత ప్రయత్నించినా ఏం జరిగిందో గుర్తు రావట్లేదు అంటుంది భాగీ. అదేంటి.. నీకు కూడా అలానే జరిగిందా? నేను కూడా నిన్న ఏదేదో చేశానని అంజువాళ్లు అంటున్నారు. కానీ, నాకేం గుర్తులేదు అంటుంది అమ్ము.

 

అదేంటి.. నిన్న పొద్దున్న మీ నాన్న కాలికి దెబ్బ తగలబోతుంటే ఆపడం, మనోహరి నన్ను కోప్పడితే నాకు సపోర్ట్​ చేయడం, ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లడం ఏం గుర్తులేదా? అని అడుగుతుంది మిస్సమ్మ. లేదంటుంది అమ్ము. అదేంటీ.. ఇద్దరికీ అలా ఒక రోజంతా జరిగింది గుర్తులేదు. అంటే ఏదో జరుగుతోంది అంటుంది మిస్సమ్మ. అక్కడ జరుగుతుందంతా చూసి గుప్త దగ్గరికి పరిగెడుతుంది అరుంధతి.

 

పర్యవసానాలు తప్పవు

అరుస్తూ వచ్చిన అరుంధతిని చూసి మళ్లీ ఏ ఉపద్రవం తెచ్చావు అంటాడు గుప్త. మిస్సమ్మకి నామీద అనుమానం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి అంటుంది అరుంధతి. నేను ఎంత చెప్పినా వినకుండా విధిరాతను మార్చేందుకు పూనుకుంటివి.. ఆ బాలికకు అనుమానం బలపడిన నువ్వేం చేయుదువు.. సరిదిద్దుకోలేని తప్పు చేసితివి బాలిక.. పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అంటాడు గుప్త. భయపడుతుంది అరుంధతి.

 

మనోహరి, మంగళ కలిసి ఘోరా దగ్గరకు వెళ్తారు. దశదిన కర్మ తర్వాత కూడా ఆ ఆత్మ భూమిని వదిలి పోలేదంటే ఆ చావు వెనక ఏదో ఉంది మనోహరి. ఆ ఆత్మ వల్ల నీకు మరింత ఇబ్బందులు కలగొచ్చు అంటాడు ఘోరా. అస్థికలు ఇంట్లోనే ఉన్నాయి వాటివల్ల ఏమైనా సమస్య ఉంటుందా అంటుంది మంగళ. ఉండే అవకాశం ఉంది అంటాడు ఘోరా.

 

ప్రవేశించే శక్తి

ఇంట్లో పెళ్లైన జంట ఉండగా ఇప్పుడు అస్థికలు నదిలో కలిపేందుకు ఒప్పుకోరు.. అయినా నాకు కావాల్సింది దాన్ని పైకి పంపించడం కాదు, దానికి ఉన్న శక్తులేంటి అనేది. ఆ ఆత్మ పాప శరీరంలో ప్రవేశించిందా లేదా తెలుసుకోవాలి అంటుంది మనోహరి. ఆ అరుంధతి జనన, మరణ సమయాల వల్ల పాప శరీరంలో ప్రవేశించే శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పాపని ఇక్కడికి తీసుకొస్తే పరిశీలించి చెప్పగలను అంటాడు ఘోరా.

 

పాపని ఇక్కడికెలా తీసుకొస్తాం.. వాళ్ల తండ్రి మనందరినీ చంపేస్తాడు అంటుంది మంగళ. నేను పాపను ఇక్కడకు తీసుకొస్తా అంటుంది మనోహరి. మంగళ వద్దని వారిస్తున్నా వినకుండా అమ్ముని ఘోరా దగ్గరికి తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తుంది మనోహరి. పాపని తీసుకొస్తే ఆ ఆత్మ గురించి తెలియని విషయాలన్నీ తెలుసుకోవచ్చు అంటాడు ఘోర. పిల్లలంతా రామ్మూర్తిని అమర్​ రూమ్​లోకి తీసుకెళ్లి అంజు గీసిన బొమ్మను చూపిస్తారు. అది చూసి బాధపడతాడు రామ్మూర్తి.

 

నిప్పంటించిన మనోహరి

చాలా బాగా గీశావమ్మా.. అచ్చం కళ్లముందు ఉన్నట్లే ఉంది అని మెచ్చుకుంటాడు. దాన్ని ఫ్రేమ్ కట్టించేదాకా ఎదురుగా పెట్టుకుందామంటూ టేబుల్ మీద పెడతాడు. అంతా కిటికీలోనుంచి చూసిన మనోహరి కోపంతో రగిలిపోతుంది. దాన్ని చంపిస్తే ఫ్రేమ్​ కట్టుకుని పూజిస్తారా.. ఈ ఫొటోని ఏం చెయ్యాలో.. ఎలా వాడుకోవాలో నాకు తెలుసు అనుకుంటుంది. పిల్లలు గీసిన బొమ్మ చాలా బాగుంది వెళ్లి చూడమ్మా అని రామ్మూర్తి భాగీతో అంటాడు.

 

మీ గదిలోనే ఉంది అని చెప్పడంతో వెంటనే చూసేందుకు పరిగెడుతుంది భాగీ. కానీ, అప్పుడే మనోహరి ఆ ఫొటోకి నిప్పంటించి దాక్కుంటుంది. కాలిపోతున్న ఫొటో చూసి కంగారు పడుతుంది భాగీ. కావాలనే మిస్సమ్మ ఆ ఫొటో కాల్చిందని అందరినీ నమ్మించాలనుకుంటుంది మనోహరి. కానీ, ఆ బొమ్మ తన పొరపాటు వల్లే కాలిందని తనమీద వేసుకుంటాడు రామ్మూర్తి.

 

కోప్పడిన అమర్

మనోహరి ఇష్టమొచ్చినట్లు రామ్మూర్తిని తిట్టడంతో కోప్పడతాడు అమర్​. నీ తండ్రి వయస్సున్న ఆయనతో అలా మాట్లాడటం తప్పని అంటాడు. ఫొటోని కాల్చేసింది మనోహరి అని మిస్సమ్మ నిరూపిస్తుందా? అమ్ముని మనోహరి ఘోరా దగ్గరకు తీసుకెళ్తుందా? అనే విషయాలు తెలియాలంటే జూన్​ 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్​ తప్పకుండా చూడాల్సిందే!

 

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024