Guppedantha Manasu June 11th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రకే ఎండీ సీటు- అందరికీ దూరంగా వసుధార- చనిపోనంటూ!

Best Web Hosting Provider In India 2024


Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మనం ఒక కొలిక్కి రావాలి. రిషి ఇంకా రాడు. వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు అని ఫణీంద్ర అంటాడు. ఇంకా టైముందికదా అని వసుధార అంటుంది. వారాలు, నెలలు గడిచిపోయాయి. ఇక రిషి రాడమ్మా. ఎప్పటికైనా వస్తాడని ఎదురుచూడొచ్చు. కానీ, ఎన్నటికీ రానివాళ్ల కోసం చూడటం అమాకత్వం అవుతుంది. రిషి లేడన్న నిజాన్ని జీర్ణించుకోవాలి అని ఫణీంద్ర అంటాడు.

 

టైమ్ అయిపోయాక తప్పదు

రిషి అంటే నాకు ఎంతిష్టమో నీకు తెలుసు. నా కొడుకు కంటే ఎక్కువ. భూషణ్ నడిపించే సత్తా రిషి ఒక్కడికే ఉందని అనుకున్నాం. కొన్నాళ్ల తర్వాత రిషికే అప్పజెప్పి.. రిటైర్ తీసుకుందామనుకున్నా. కానీ, ఇలా జరిగింది. నాకు రిషి జ్ఞాపకాలు గుర్తు వస్తుంటాయి. నాకు కష్టంగానే ఉంటుంది. ఎంత గొప్ప వాళ్లైనా సరే వాళ్ల టైమ్ అయిపోయాక ఈ లోకాన్ని వదిలివెళ్లిపోవాల్సింది. వాళ్లకంటూ ఒక ఎక్స్‌పైర్ డేట్ వస్తుంది అని ఫణీంద్ర అంటాడు.

 

అది కాదు సర్. అలా మాట్లాడకండి అని వసుధార అంటుంది. ఏంటీ అలా ప్రవరిస్తున్నావ్. ఇంతమంది చెప్పిన ఎందుకు వినట్లేదు. మాకు మాత్రం ప్రేమలేదా. నీలా బయటకు అంటున్నామా. రిషి లేడని రిషి పరువు, కాలేజీ పరువు తీస్తున్నావ్. రిషి కర్మకాండలు ఆరోజే నిర్వహిస్తే ఇదంతా జరిగేది కాదు అని దేవయాని అంటుంది. అవును వసుధార నేను రిషి రామలక్ష్మణులా ఉండలేం. కానీ, ఇలా జరిగింది. ఇది మన రాత అనుకుని ఊరుకోవాల్సిందే అని శైలేంద్ర అంటాడు.

 

ఒప్పుకోమ్మని అంటున్నారా

వసుధారకు నువ్వే అర్థమయ్యేలా చెప్పు. మంత్రి గారు కూడా అన్నారట. కాలేజీ ఇంకా డౌన్ ఫాల్ అవుతుందని మహేంద్రను అంటుంది దేవయాని. నువ్వే కన్విన్స్ చేయు అని ఫణీంద్ర అంటాడు. నేను చెప్పేదేం లేదు. వసుధార ఏది అంటే అదే. రిషి బతికి ఉన్నాడంటే బతికి ఉన్నాడు. నేను వసుధారకే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నువ్ చనిపోయాడని చెబితే దానికే ఒప్పుకుంటాను అని మహేంద్ర అంటాడు. ఏంటీ మావయ్య ఇన్‌డైరెక్ట్ ఒప్పుకోమ్మని చెబుతున్నారా అని వసుధార అంటుంది.

 

నేను అలా అనడంలేదు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అని మహేంద్ర అంటాడు. అవును వసుధార. నువ్ ఏది చెబితే దానికి సపోర్ట్ చేస్తాను అంటున్నారు అని శైలేంద్ర అంటాడు. ఇప్పటికైనా రిషి చనిపోయాడని ఒప్పుకో. నువ్ ఒప్పుకుంటే అంతా కలిసి అఫీషియల్‌గా సంతాపం పెడితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. అంతా బాధపడతాం. ఒక వారం పది రోజుల్లో ఆ బాధలో నుంచి బయటకు వచ్చి అంతా బిజీగా ఉంటారు. లేకుంటే ఈ గొడవలు ఇలాగే జరుగుతాయి అని ఫణీంద్ర అంటాడు.

 

ఇబ్బంది పెట్టొద్దు

మీరు వారం రోజుల్లో ఆ బాధ నుంచి బయటకు వస్తారని అంటున్నారు. కానీ, నేను రిషి సారే జీవితం అనుకున్నాను. అలా మర్చిపోయి నేను బతకలేను. నేను ఇక్కడ బతికి ఉన్నానంటే రిషి సార్ బతికే ఉన్నారు. లేదు రిషి సార్ చనిపోయారని అంటున్నారా నేను ఇక్కడ చనిపోయినట్లు. అంతేసార్. ఈ విషయంలో ఇబ్బందిపెట్టొద్దు అని వసుధార వెళ్లిపోతుంది. ఎవరు పిలిచినా ఆగదు. ఇప్పుడేం చేద్దాం అని ఫణీంద్ర అంటాడు.

 

చెప్పాను కదా అన్నయ్య. తను ఏది నమ్మితే సపోర్ట్‌‍గా ఉంటానని అని దండం పెట్టి మహేంద్ర కూడా వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. ఫణీంద్ర సార్ అలా అడిగితే స్పష్టంగా చెప్పకుండా అలా అన్నారు అని వసుధార నిలదీస్తుంది. నేను క్లియర్‌గానే చెప్పాను. నువ్ ఏది నమ్మితే అదే నమ్ముతానని. అందులో ద్వంద అర్థాలు లేవు. నేను నీకే సపోర్ట్ చేస్తాను అని మహేంద్ర అంటాడు. ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నారని మను అడుగుతాడు.

 

నిర్ణయాలు కూడా అలాగే

నేను ఇప్పుడేం చెప్పలేను అని వసుధార అంటుంది. మినిస్టర్ గారు, ఫణీంద్ర సార్ పిలిచి మాట్లాడారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని మను అంటాడు. నేను మాట తప్పలేను. మాట మార్చుకోలేను. ఒటమి అంచుల్లో ఉన్నానని తల దించుకోలేను. అప్పుడు నేను ఏ మాట అయితే ఇచ్చానో అదే మాట మీద ఉంటాను. ఆ విధంగానే నా నిర్ణయాలు కూడా ఉంటాయి. 3 నెలల్లో రిషి సార్‌ను తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదు. ఇంకా రెండు రోజులే ఉంది. తీసుకొస్తానో లేదో నాకు తెలియదు అని వసుధార అంటుంది.

 

నేను మాత్రం నా మాట మీద నిలబడే ఉంటాను. రిషి లేకుండా వసుధార ఉండదు అని వసుధార అంటుంది. కానీ, ఇప్పుడు వసుధార ఉంది. రిషి లేడుగా అని అనుపమ అంటే.. అయితే ఈ వసుధార కూడా లేనట్లే. సర్ లేరంటే నేను ఉన్నా లేనట్లే అని వసు అంటుంది. అంటే ఏంటీ. ఎలాంటి అఘాయిత్యాలు. కఠిన నిర్ణయాలు తీసుకోవు కదా అని మహేంద్ర అంటాడు. అలాంటి ఆలోచనలు నాకు లేవు మావయ్య. కాలేజీకి వస్తాను. రేపు వచ్చి నా నిర్ణయం చెబుతాను అని వసుధార అంటుంది.

 

తటస్థంగా ఉన్నారు

అదేదో మాకు ముందే చెప్పొచ్చు కదా అని మహేంద్ర అడిగితే.. కొన్ని నిర్ణయాలు అందరిముందే చెప్పాలి. నిజంగా మీరు రిషి సార్ విషయంలో సపోర్ట్ చేస్తున్నారా. నేను ఇప్పుడు ఓటమి దగ్గరిలో ఉన్నా కదా. మీరు ఏమనుకుంటున్నారు. నేను కూడా రిషి సార్ లేరని ఒప్పుకోమ్మంటారా. లేదా ఉన్నారని సమర్ధిస్తారు. నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు తటస్థంగా ఉన్నారు. ఇప్పుడు ఏ విషయం చెప్పలేకపోతున్నారు. అలాంటిది మీరు నా నిర్ణయాన్ని ఎందుకు ఇంత త్వరగా తెలుసుకోవాలనుకుంటున్నారు అని వసుధార అడుగుతుంది.

 

కానీ, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. మన పెయిన్‌ను మనకంటే ఎక్కువగా ఎవరు ఫీల్ అవ్వలేరని అర్థమైంది. అది స్వంతవాళ్లు, అయినా వాళ్లు కావొచ్చు. మన పెయిన్‌ను మనం మాత్రమే అనుభవించగలం అని వసు అంటుంది. మను గారు రేపు బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయండి. మావయ్య మీరు రండి. మినిస్టర్‌ గారికి కాల్ చేసి రమ్మని చెప్పండి. అక్కడే నా నిర్ణయం చెబుతాను చెప్పి వెళ్లిపోతుంది. ఏ నిర్ణయం తీసుకుందో అర్థం కావడంలేదని అనుపమ, మహేంద్ర అనుకుంటారు.

 

నాకు అనుకూలంగానే నిర్ణయం

కట్ చేస్తే మరుసటి రోజు బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. సడెన్‌గా మీటింగ్ ఏంటని మహేంద్ర, ఫణీంద్రను మినిస్టర్ అడుగుతాడు. తెలియదని వాళ్లు అంటారు. వసుధార ఎందుకు మీటింగ్ పెట్టింది. నేను అన్నదానికి హర్ట్ అయిందా అని ఫణీంద్ర అనుకుంటాడు. అంతా అలాగే ఆలోచిస్తారు. వసుధార ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అనుకూలంగానే ఉంటుంది అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు తన ఛాంబర్‌లో రిషితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది వసుధార.

 

హార్ట్ సింబల్ పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. మీరు నాపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. నేను అదే నమ్మకంతో పని చేస్తున్నాను. కాలేజీ చేయి జారకుండా చూసుకున్నాను. కానీ, ఈసారి నేను తీసుకున్న నిర్ణయం మీకు నచ్చకపోవచ్చు సర్. నన్ను క్షమించండి. నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను అని వసుధార అంటుంది. ఏం చేయబోతున్నారు మేడమ్ అని మను ఎంట్రీ ఇస్తాడు.

 

చనిపోనన్న వసుధార

మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి అని మను అడుగుతాడు. బోర్డ్ మీటింగ్‌లో అందరితోపాటు మీకు తెలుస్తుంది అని వసుధార అంటుంది. మీరు ఏం చేస్తారో తెలియక మేము కంగారుపడుతున్నాం అని మను అంటే.. నేను ఏం చనిపోను అని వసుధా అంటుంది. దాంతో మను షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. శైలేంద్రకే ఎండీ సీటు అప్పగించే కాలేజీకి, అందరికీ దూరంగా వసుధార వెళ్లిపోనుందని తెలుస్తోంది.

 

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024