Best Web Hosting Provider In India 2024
Panchayat 3 Web Series: పంచాయత్ వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. తాజాగా ప్రైమ్ వీడియోలో కొన్ని రోజుల కిందట మూడో సీజన్ కూడా వచ్చేసింది. అయితే ఈ సీజన్ కోసం అత్యధికంగా లీడ్ యాక్టర్ జితేంద్ర కుమార్ రెమ్యునరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై అతడు స్పందించాడు. ఈ సిరీస్ లో అతడు పంచాయత్ సచివ్ అభిషేక్ త్రిపాఠీ పాత్రలో నటించాడు.
పంచాయత్ 3 రెమ్యునరేషన్లు
పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూశారు. తొలి రెండు సీజన్లు సూపర్ హిట్ కావడంతో మూడో సీజన్ పై ఆసక్తి పెరిగింది. అయితే ఇందులో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లు కూడా పెరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అత్యధికంగా లీడ్ యాక్టర్ జితేంద్ర కుమార్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.70 వేలు తీసుకున్నాడని సమాచారం.
ఆ లెక్కన 8 ఎపిసోడ్లు కలిపి రూ.5.6 లక్షలు వసూలు చేశాడు. అయితే దీనిపై తాజాగా జితేంద్ర స్పందించాడు. తన రెమ్యునరేషన్ నిజమా కాదా అన్నది చెప్పకుండా ఒకరి ఆర్థిక వ్యవహారాల గురించి చర్చించడం సరికాదని అతడు అనడం గమనార్హం. ఇదే సిరీస్ లో నటించిన సీనియర్ నటి నీనా గుప్తా ఒక్కో ఎపిసోడ్ కు రూ.50 వేలు తీసుకున్నట్లు కూడా సమాచారం.
మరొకరి జీతం గురించి మాట్లాడొద్దు
తన రెమ్యునరేషన్ పై జితేంద్ర స్పందిస్తూ.. “మరొకరి జీతం, ఆర్థిక వ్యవహారాల గురించి చర్చించడం నిజంగా సరికాదు. ఈ చర్చతో వచ్చేదేమీ లేదు. దానివల్ల లాభం కూడా ఏమీ లేదు. అందుకే ఇలాంటి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దు” అని జితేంద్ర అన్నాడు. ది వైరల్ ఫీవర్ తెరకెక్కించిన ఈ పంచాయత్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ పైనా అతడు స్పందించాడు.
టీవీఎఫ్ రూపొందించిన పిచర్స్, కోటా ఫ్యాక్టరీలాంటి వెబ్ సిరీస్ లలోనూ అతడు నటించాడు. ఇప్పుడు కోటా ఫ్యాక్టరీ మూడో సీజన్ కూడా రాబోతోంది. “ఓ నటుడిగా ఈ పంచాయత్ షో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. నా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే పెద్దగా ఏమీ మారలేదు. మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఏవో చిన్న మార్పులు మాత్రమే చేసుకున్నాను” అని జితేంద్ర చెప్పాడు.
“ఓ నటుడిగా మనం నటించిన షో ఇంత పెద్ద హిట్ అయినప్పుడు, అందరి నుంచి ఇంత ఆదరాభిమానాలు లభిస్తున్నప్పుడు మరిన్ని గొప్ప అవకాశాలు వస్తాయి. అదే సమయంలో అభిమానుల అంచనాలను అందుకునేలా నేను మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది” అని జితేంద్ర అన్నాడు.
పంచాయత్ సీజన్ 3 గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్లలాగే ఈ కొత్త సీజన్ కూడా అభిమానుల మనసులు గెలుచుకుంది. మూడో సీజన్ ను ఆసక్తికరంగా ముగించి నాలుగో సీజన్ గురించి వేచి చూసేలా చేశారు. ఫులేరా గ్రామంతోపాటు అభిషేక్ త్రిపాఠీ జీవితం ఎటు వైపు వెళ్తుందనేది నాలుగో సీజన్ లో చూపించే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits