Best Web Hosting Provider In India 2024
Kota Factory Season 3 trailer: నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఒకటి కోటా ఫ్యాక్టరీ. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే ఓ జీతూ భయ్యా చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఈ కోటా ఫ్యాక్టరీ మూడో సీజన్ రానుండగా.. దీనికి సంబంధించిన ట్రైలర్ మంగళవారం (జూన్ 11) రిలీజ్ చేశారు.
కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ట్రైలర్
ఈ కోటా ఫ్యాక్టరీలో జీతూ భయ్యాగా అందులోని స్టూడెంట్స్ మనసులే కాదు ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకున్న జితేంద్ర కుమార్.. మూడో సీజన్ తో మళ్లీ వచ్చేస్తున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఎంతో ఇంట్రెస్టింగా సాగింది. తనను స్టూడెంట్స్ జీతూ సర్ అని కాకుండా జీతూ భయ్యా అని పిలవడం వెనుక ఉన్న కారణమేంటో కూడా ఇందులో అతడు చెప్పాడు.
ఇక విజయం కోసం సిద్ధం కావడం కాదు.. సిద్ధమవడమే విజయం అంటూ జీతూ భయ్యా ఓ పాడ్‌కాస్ట్ లో చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అటు ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర అయిన వైభవ్ (మయూర్ మోరె), అతని ఫ్రెండ్స్ తమ ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం రెడీ అవుతూ ఎంతో ఒత్తిడిలో కనిపిస్తారు. ఒకప్పుడు ఎంతో మంది చురుకైన స్టూడెంట్స్ ను ఐఐటీలకు అందించిన కోటా ఇప్పుడు ఓ మాస్ ప్రొడక్షన్ గా మారిపోయిందనే డైలాగ్ కూడా ఈ ట్రైలర్ లో చూడొచ్చు.
మూడేళ్ల తర్వాత మూడో సీజన్
కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ రెండో సీజన్ 2021లో వచ్చింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా ఊహించినట్లే ఈ కొత్త సీజన్ జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కొన్నాళ్ల కిందట ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను నేరుగా చెప్పకుండా ప్రేక్షకులకే ఓ ప్రాబ్లం సాల్వ్ చేసి తెలుసుకోవాలని వదిలేసిన విషయం తెలిసిందే.
ఆ మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేసిన అభిమానులు జూన్ 20 అని అప్పుడే తేల్చేశారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదే తేదీ చెప్పింది. అంటే మరో 9 రోజుల్లోనే కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019లో రాగా.. రెండో సీజన్ 2021లో స్ట్రీమింగ్ అయింది. ఈ రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
దీంతో మూడో సీజన్ కోసం మూడేళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. జితేంద్ర కుమార్ ఓటీటీ షారుక్ ఖాన్ అంటూ ఈ ట్రైలర్ చూసిన ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం. జీతూ భయ్యా నుంచి కొత్త జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు మరో అభిమాని అన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits