Munjya: భయపెడుతున్న హారర్ మూవీ మంజ్యాకు బాహుబలితో కనెక్షన్.. కట్టప్పపై హీరోయిన్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


Munjya Sharvari Wagh Bahubali Kattappa: బాలీవుడ్ ముద్దుగుమ్మ శర్వారి ప్రధాన పాత్రలో నేష్ విజన్ బ్లాక్‌ బస్టర్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘ముంజ్యా’ అనే చిత్రం వచ్చింది. ఇటీవల జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలై భయపెట్టే అంశాలు బాగున్నాయని, డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటోందని కామెంట్స్ వినిపించాయి.

అయితే ఈ మంజ్యా సినిమాలో నటుడు సత్య రాజ్ ప్రముఖ పాత్రను పోషించారు. గ్లోబల్ హిట్ మూవీ బాహుబలితో కట్టప్పగా సత్య రాజ్ ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో తెలిసిందే. కట్టప్పగా చేసిన సత్య రాజ్ పాత్రతో మంజ్యాకు, బాహుబలికి కనెక్షన్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, బాహుబలి కట్టప్ప అయిన సత్యరాజ్‌తో పని చేసిన అనుభవం గురించి హీరోయిన్ శర్వారి వాఘ్ చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయింది.

ఓ ఇంటర్వ్యూలో సత్య రాజ్‌పై శర్వరి వాఘ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ఎస్ఎస్ రాజమౌళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసిన బాహుబలికి వీరాభిమానిని. ఆ మూవీని ఎన్నో సార్లు చూశాను. ఇక ఈ చిత్రంలో కట్టప్పగా చేసిన సత్య రాజ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నానని తెలియడంతో ఎంతో సంతోషించాను.సెట్‌లో మొదటి రోజు నుండి సత్యరాజ్ అంకితభావం, నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను” అని శర్వరి వాఘ్ తెలిపింది.

“సత్యరాజ్ సర్‌ని సెట్‌లో చూడటంతో ప్రతిరోజూ యాక్టింగ్ వర్క్‌షాప్‌కు హాజరైనట్లుగా ఉంది. అతని బహుముఖ ప్రజ్ఞ, సహనం, పరిపూర్ణ ప్రతిభ అన్నిటినీ మించిపోయింది. అది కామిక్ సీన్ అయినా లేదా ఇంటెన్స్ మూమెంట్ అయినా, సత్యరాజ్ సర్ ఎంతో సెటిల్డ్‌గా ప్రతి సన్నివేశానికి జీవం పోశారు. ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉంది. అలాంటి అవకాశం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను” అని శర్వరి వాఘ్ చెప్పుకొచ్చింది.

దినేష్ విజన్ సమర్పణలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ముంజ్యా చిత్రాన్ని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. 2024 జూన్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే, మొదట మంచి కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ హర్రర్ కామెడీ చిత్రం మొదటి వారం రోజుల్లో వసూళ్లు తగ్గిపోయాయి.

మోనా సింగ్, శర్వరి వాఘ్, అభయ్ వర్మ నటించిన మంజ్యా సినిమా సోమవారం రూ . 20 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ. 23 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక విడుదలైన నాలుగో రోజు రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. విడుదలైన తొలిరోజే రూ.4 కోట్లు వసూలు చేసిన మంజ్యా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

మంజ్యా మూవీ రెండో రోజు రూ.7.25 కోట్లు, మూడో రోజు రూ.8 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే మంజ్యా ఇప్పటి వరకు ఇండియాలో రూ.23 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి సినిమాతో సత్యరాజ్‌కు బీభత్సమైన పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. గతంలో సత్య రాజ్ ప్రభాస్‌తో మిర్చీలో నటించారు. ఇందులో ప్రభాస్‌కు తండ్రిగా ఆకట్టుకున్నారు. అలాగే గోపీచంద్ నటించిన శంఖం సినిమాలో కూడా నటించారు సత్య రాజ్.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024