Hajj yatra 2024: హజ్ యాత్ర అంటే ఏంటి? ఇది ముస్లింలకు ఎందుకంత ముఖ్యమైనది

Best Web Hosting Provider In India 2024

Hajj yatra 2024: ఇస్లాం ఐదు మూల స్తంభాలలో మక్కా ఒకటి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని అనుకుంటారు. ఇస్లాం మతం ప్రకారం ఉన్న ఐదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. అందుకే ఈ పవిత్రమైన యాత్ర చేపట్టేందుకు ఎన్నో ఏళ్లు ఎదురుచూస్తారు.

ఈ యాత్ర చేపట్టిన వాళ్ళు పూర్తిగా జీవితకాలం ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతారు. దేవుని క్షమాపణ కోరుకుంటూ గత పాపాలను తొలగించడం అని కోరుకునే అవకాశం హజ్ యాత్ర ద్వారా దక్కుతుంది.

హజ్ యాత్ర అంటే ఏమిటి?

హజ్ అనేది సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర. ప్రతి ముస్లిం వ్యక్తి ఇది జీవితకాలంలో ఒకసారైనా చేయాల్సి ఉంటుంది .కొంతమంది ముస్లింలు ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా ప్రయాణం చేస్తారు. ఆర్థికంగా, శారీరకంగా ధృడంగా ఉన్న వాళ్ళు హజ్ యాత్ర చేస్తారు.

విశ్వాసం, ప్రార్థన, క్షమాపణ, ఉపవాసం ప్రాముఖ్యతను యాత్ర తెలియజేస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో ఈ యాత్ర చేపడతారు. ఐదు రోజుల పాటు సాగుతుంది. బక్రీద్ పండుగతో హజ్ యాత్ర ముగుస్తుంది.

ముస్లింలకు హజ్ యాత్ర ఎందుకు ముఖ్యమైనది?

హజ్ చేయడం అనేది మతపరమైన బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చినట్లు అర్థం. చాలామందికి జీవితకాలంలో లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది .గత పాపాలను క్షమించమని కోరుకుంటూ భగవంతుడని దర్శించుకుని దేవుడికి దగ్గరగా ఉండేందుకు, ప్రవక్తల అడుగుజాడల్లో నడిచేందుకు ఇది ఒక అవకాశంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులను ఒక్కటికి చేర్చే ఏకైక ప్రదేశం ఇది. ఐక్యత, అనుబంధం, వినయం, సమానత్వం అనే భావాన్ని హజ్ యాత్ర కలిగిస్తుంది.

చాలామంది యాత్రికులు హజ్ యాత్ర చేయాలనే ఆశతో సంవత్సరాలుగా ప్రార్థిస్తూ, డబ్బు కూడబెట్టుకుంటారు. ఈ యాత్రకు బయలుదేరడానికి అనుమతి కోసం ఎదురుచూస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసంగా చెప్తారు.

అహ్రాం అంటే ఏంటి?

ఇస్లాం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త హజ్ యాత్రకు పిలుపునిచ్చారని చెబుతారు. అనేక దేశాల నుంచి ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు తరలి వస్తారు. మక్కాలోకి ప్రవేశించే ముందు ముస్లింలు తమ శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. తెల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఇక్కడ ఆచారం. దీన్నే అహ్రాం అంటారు. ఈ తెల్లని వస్త్రాన్ని కుట్టరు. మహిళలు అహ్రాం ధరించాల్సిన అవసరం లేదు. తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించి తలకు హిజాబ్ చుట్టుకుంటారు.

హజ్ యాత్ర సాగేది ఇలా..

మక్కాకి చేరుకున్న తర్వాత ఉమ్రా అనే ఆధ్యాత్మిక యాత్ర చేపడతారు. ఇది హజ్ యాత్రలో తప్పనిసరి కాకపోయినా కొంతమంది చేస్తారు. అక్కడ ఉన్న కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దాన్ని ముట్టుకోవడం, ప్రార్థనలు చేయడం చేస్తారు. తాము చేసిన పాపాలను క్షమించమని వేడుకుంటారు. ఈ ఆచారాన్ని ‘తవాఫ్’ అంటారు. మక్కాలోని కాబా చుట్టూ అపసవ్య దిశలో ఏడుసార్లు ప్రదక్షిణలు చేస్తారు. కాబాను పూజించరు. క్యూబ్ ఆకారపు నిర్మాణాన్ని వారు దేవుని స్వరూపంగా భావిస్తారు.

ఉమ్రా యాత్ర తర్వాత మీనా పట్టణానికి వెళ్తారు. ఇది మక్కాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి హజ్ యాత్రికులు అరాఫత్ మైదానం చేరుకుంటారు. అక్కడే నిలబడి తమ పాపాలను క్షమించమని వేడుకుంటూ అల్లాను ప్రార్థిస్తారు. తర్వాత జమారత్ పిల్లర్ దగ్గరకు వెళ్లి సైతాను రాళ్లతో కొడతారు. మేక లేదా గొర్రెను ఈ ప్రాంతంలో బలిస్తారు. మగవారు గుండు చేయించుకుంటే, ఆడవాళ్లు కొంత జుట్టును సమర్పిస్తారు. అనంతరం మళ్ళీ మక్కాకు చేరుకుని బక్రీద్ జరుపుకుంటారు. ఈ పండుగతో హజ్ యాత్ర ముగుస్తుంది.

ఈద్ ఉల్ అదా

ఈద్ ఉల్ అదాను బక్రీద్ అంటారు. ముస్లింల జరుపుకునే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన పండుగలలో ఇదీ ఒకటి. ప్రవర్త ఇబ్రహీం అల్లా ఆజ్ఞ మేరకు తన కుమారుడైన ఇస్మాయిల్ ని బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ దేవుడు తనని ఆపి ఒక గొర్రెను బలి ఇవ్వమని చెప్తారు. అందుకే బక్రీద్ రోజున ముస్లింలు మేకలు, గొర్రెలను బలి ఇస్తారు. తాజా మాంసాన్ని అందరికీ పంచి పెడుతూ పండుగ వేడుక చేసుకుంటారు.

ఈద్-ఉల్ అదా దుల్హ హిజ్జా 10 వ రోజున వస్తుంది. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఇది 12వ నెల. బక్రీదు రోజు ముస్లింలందరూ ప్రార్థనలు చేసేందుకు మసీదులకు వెళ్తారు. దీన్ని సలాత్ అల్ ఈద్ అంటారు. అనంతరం జంతుబలి చేస్తారు. మాంసాన్ని అందరికీ పంచిపెడుతూ సమాజంలోని పేదల పట్ల తమ దాతృత్వాన్ని చాటుకుంటారు. అందుకే దీనిని బక్రీద్ అంటారు. దీని అర్థం బలి విందు. ఈ ఏడాది బక్రీద్ జూన్ 15 లేదా 16న జరుపుకోనున్నారు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024